తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న అంశంపై రోజురోజుకీ హడావుడి పెరుగుతోంది. తాను ఏమైనా అనుకుంటే ఆ అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరికి తగ్గట్లే.. తాజాగా హాట్ టాపిక్ అయిన కొత్త జిల్లాల ఏర్పాటు మీద పలు నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. అన్ని అనుకున్నట్లే జరిగితే.. కొత్త జిల్లాలకు సంబంధించిన అధికారిక ప్రకటన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఉంటుందని చెబుతున్నారు. అధికారప్రకటనకు ముందే.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తెలంగాణ సర్కారు ఎంత కమిట్ మెంట్ తో ఉందన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. ఏదో తూతూ మంత్రంగా కాకుండా.. తెలంగాణ స్వరూపాన్ని మార్చేలా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలన్నది కేసీఆర్ భావనగా కనిపిస్తోంది.
దీనికి తగ్గట్లే కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన నిధులను కేటాయించటంతో పాటు.. మరికొన్ని అంశాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు. కొత్త జిల్లా ఒక్కొక్క దానికి రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయించటంతో పాటు.. 25 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాంగణంలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు.. ప్రతి కొత్త జిల్లాకు మాస్టర్ ప్లాన్ ఒకటి ప్రకటించటం.. అందుకు తగ్గట్లే దాని కార్యాచరణకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ప్రకటించాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
రహదారుల విస్తరణ.. అంతర్గత రోడ్ల నిర్మాణం.. రాజధాని నగరానికి వెళ్లేలా రాష్ట్ర.. జాతీయరహదారులకు అనుసంధానం చేసేలా రోడ్ల నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు కొత్త జిల్లా ప్రధాన కేంద్రాలు ట్రాఫిక్ కోరల్లో చిక్కుకోకుండా పరిష్కారాలతో పాటు.. మంచినీటి అవసరాలకు తగ్గట్లు ప్రత్యేక జలశయాల్ని నిర్మించనున్నారు. బస్ స్టేషన్ల విస్తరణ.. కొత్త జిల్లా కేంద్రాల్లో కొత్తగా అతిధిగృహాలు.. పోలీస్ స్టేషన్లు.. భారీ మీటింగ్ హాల్స్..పార్కులు.. స్టేడియంలు.. రవీంద్ర భారతి.. శిల్పారామం తరహాలో కొత్త నిర్మాణాలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణను మొత్తంగా మార్చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారన్న విషయాన్ని తెలంగాణలోని ప్రతిఒక్కరూ నమ్మేలా ఉండాలన్నదే కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న హడావుడి తీరు చూస్తుంటే.. కేసీఆర్ సర్కారు ఇలాంటి భావనను కలిగించటంలో సక్సెస్ అవుతుందనే చెప్పాలి.