రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చంద్రుళ్లు రాజకీయంగా ఉప్పునిప్పులా తయారు కావటం తెలిసిందే. వారి మధ్య సంబంధాలు సరిగా లేని సమయంలో.. ఈ ఇరువురు కలిసే అవకాశాలు చాలానే వచ్చినా.. ఇద్దరు ఎవరికి వారు బిగుసుకుపోయినట్లు వ్యవహరించే వారు. ఇద్దరు హాజరు కావాల్సిన కార్యక్రమానికి ఎవరో ఒకరు డుమ్మా కొట్టే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ డుమ్మా కొట్టేశారు కూడా.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇరువురి మధ్య సంబంధాలు చక్కగా ఉండటం.. ఆత్మీయంగా పిలుచుకోవటం.. మాట్లాడుకోవటం..లాంటివి చేస్తున్నారు. ఒకరిపట్ల ఒకరు మర్యాదగా.. గౌరవంగా ఉంటున్నారు. రాజకీయంగా కూడా ఇద్దరిలో ఏ ఒక్కరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోని పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత ఇద్దరు చంద్రుళ్లు ముఖ్యమంత్రులు అయ్యాక.. స్వల్ప వ్యవధిలోరెండుసార్లు కలుసుకోవటం ఇప్పటివరకూ జరగలేదనే చెప్పాలి.
ఈ కొరత తీరుస్తూ కేవలం మూడురోజుల వ్యవధిలో రెండుసార్లు ఇద్దరు చంద్రుళ్లు కలవటం.. కులాసాగా కబుర్లు చెప్పుకోవటం విశేషంగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగం చివరి రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఇది జరిగిన రెండు రోజులకే ఈ ఇద్దరు చంద్రుళ్లు మరోసారి కలిశారు. ఇంత స్వల్ప వ్యవధిలో ఇద్దరు తెలుగు సీఎంలు కలవటం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. ఇద్దరి మధ్య సంబంధాలు బాగోపోతే వీరిద్దరూ ఎలా వ్యవహరించే వారన్న దాన్ని ఇప్పటికే చూశారు. ఇప్పుడు.. వీరిద్దరి మధ్య సంబంధాలు చక్కగా ఉంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలు చూస్తున్న పరిస్థితి.