ప్రపంచాన్ని వణికించిన కరోనాను గులాబీ బాస్ కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సలు లెక్క చేయరా? అంటే లేదనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తం ఒకలా.. మన దేశంలోని కొందరు ముఖ్యమంత్రులు మరోలా వ్యవహరించటం తెలిసిందే. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మొదటి.. రెండో వేవ్ లలోనూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖానికి మాస్కు పెట్టుకోకుండా తిరగటం తెలిసిందే.దీనిపై ఎన్ని విమర్శలు.. మరెన్ని జోకులు పేలినా లైట్ తీసుకోవటం.. చాలా తక్కువ సందర్భాల్లోనే ముఖానికి మాస్కు తగిలించుకోవటం తెలిసిందే.
వారం క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతం తెలంగాణలో కేసుల నమోదు కాస్త నెమ్మదించినప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదు కావటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఒక హాలులో దాదాపు ముఫ్పై మందితో సమావేశమైన కేసీఆర్ కు సంబంధించిన ఫోటోను చూసినంతనే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. వయసులో దాదాపుగా అందరూ అరవై ఏళ్లకు పైబడిన వారే. కొందరు మాత్రమే యాబై కంటే తక్కువ వయసు ఉన్న వారు. కరోనా మూడో వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఒక్కరంటే ఒక్కరు కూడా ముఖానికి మాస్కు పెట్టుకోకపోవటం చూస్తే.. వారి ధైర్యానికి హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
కరోనా వ్యాప్తికి చెక్ పెట్టే ముఖ్యమైన రెండు అంశాల్లో ఒకటి భౌతిక దూరం.. మరొకటి ముఖానికి మాస్కు. పైన పోస్టు చేసిన ఫోటో (ఒక ప్రముఖ పత్రికలో ప్రధానంగా పబ్లిష్ అయ్యింది)ను చూస్తే.. ఈ రెండు అంశాల్ని అస్సలు పట్టించుకోకపోవటం కనిపిస్తుంది. సాధారణంగా కరోనా వేళలో.. ఒకరి పక్కన ఒకరు కూర్చునే పరిస్థితి లేదు. అలాంటిది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఎంపీలు.. ఒకరి పక్కన ఒకరు కూర్చోవటం.. వారి మధ్య అడుగు కూడా దూరం లేకపోవటం చూసినప్పుడు ఇంతటి ధైర్యం వారికెలా సాధ్యమన్నది అసలు ప్రశ్న.
ఎంపీలకు కాస్తంత దూరంగా కూర్చున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. వారికి పార్లమెంటులో ఎలా వ్యవహరించాలి? ఏమేం చేయాలన్న ఎజెండాను మార్గదర్శనం చేయటం కనిపిస్తుంది. ఆ సందర్భంగా కేసీఆర్ తో సమా.. సమావేశ మందిరంలో ఉన్న ఏ ఒక్క ఎంపీకి కానీ.. కీలక అధికారుల ముఖానికి కానీ మాస్కు లేకపోవటం చూస్తే.. కరోనా వేళలో ఇలాంటి దమ్ము.. ధైర్యం గులాబీ అధినేతకు ఆయన్ను ఫాలో అయ్యే నేతలకు మాత్రమే ఉంటుందని చెప్పక తప్పదు. ఏమైనా.. కరోనాకు ప్రపంచమంతా వణుకుతూ.. చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటే.. అందుకు భిన్నంగా.. పిచ్చ లైట్ తీసుకున్న సంకేతాన్ని ఇచ్చేలా ఉన్న ఈ ఫోటోను చూస్తే.. కరోనా సైతం ఆశ్చర్యానికి గురవుతుందేమో? ప్రపంచానికి షాకిచ్చే కరోనాకు.. తన తీరుతో తిరిగి షాకిచ్చే సత్తా కేసీఆర్ అండ్ కోకు మాత్రమే ఉందని చెప్పకతప్పదు.