ఫాంహౌస్ లో కేసీఆర్, కేటీఆర్.. ఏం జరుగుతోంది?

Update: 2020-12-15 13:55 GMT
ఊరికే రారు మహానుభావులు అన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేముందు.. సంచలనాలకు నాంది పడే ముందు ఖచ్చితంగా తన ఫాంహౌస్ కు వచ్చి చర్చలు జరుపుతారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అందుకు తగ్గట్టే.. ఢిల్లీకి హడావుడిగా వెళ్లి.. బీజేపీ పెద్దలను కలిసి చర్చించి డైరెక్టుగా ఫాంహౌస్ కు కేసీఆర్ రావడం ఆసక్తి రేపుతోంది.

ఢిల్లీ నుంచి రాగానే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తన ఫాంహౌస్ కు వెళ్లారు. అయితే మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో రివ్యూ సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్.. అనంతరం ఫాంహౌస్ కు చేరుకున్నారు.

అయితే మంత్రి కేటీఆర్ కూడా ఫాంహౌస్ కు వెళ్లడమే రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తండ్రి, తనయుడు ఇద్దరు ఫాంహౌస్ లో ఏకాంత భేటి అయినట్లు సమాచారం. సుధీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటన వివరాలను కేటీఆర్ కు చెప్పడంతోపాటు పార్టీలో అనుసరించాల్సిన విధానాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ల ఏకాంత భేటితో ఎవరికి ఎలాంటి ఉపద్రవాలు వస్తాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అసలు మ్యాటర్ ఏంటనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News