సెలవుతో మరోసారి దోచుకున్న కేసీఆర్

Update: 2015-12-31 04:38 GMT
చిన్నదైనా.. పెద్దదైనా.. బహుమతి బహుమతే. ఊహించని విధంగా ఏదైనా ప్రైజ్ చేతికి వస్తే ఆ సంతోషమే. అదే విధంగా అనుకోని విధంగా సెలవు వస్తే ఆ ఆనందమే వేరు. అనుకోని ఘటనలు.. విషాదాల వల్ల సెలవు రావటం వేరు.. పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవు ఇవ్వటం వేరు. పండగ కంటే ఎక్కువగా అందరూ హ్యాపీగా జరుపుకునే జనవరి 1ని సెలవు దినంగా ప్రకటించింది తెలంగాణ సర్కారు.

ఒకరోజు సెలవు ప్రకటించాలంటే ప్రభుత్వాలు కిందామీదా పడుతుంటాయి. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ కాస్త భిన్నం. ప్రజలకు మూడ్ కి తగినట్లుగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. సెలవుల విషయంలో ఆయన చాలా లైట్ గా ఉంటారు. ఏదైనా పెద్ద కార్యక్రమం కానీ పర్వదినం కానీ వస్తే.. పెద్దగా ఆలోచించకుండా సెలవు ఇచ్చేస్ ఆయన.. తాజాగా మరో సెలవు ప్రకటించారు. జనవరి 1 ని సెలవుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవటంపై ఉద్యోగ సంఘాల వారు హర్షం ప్రకటిస్తున్నారు. సెలవుల్ని ప్రకటించటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంత ఉదారంగా మరే ముఖ్యమంత్రి ఉండరనే చెప్పాలి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సెలవుల విషయంలో కేసీఆర్ అనుసరించే విధానంతో.. తెలంగాణలో పని చేసే ఏపీ క్యాడర్ కు ఇబ్బందులే ఇబ్బందులు అని చెప్పొచ్చు. ఒకపక్కన తెలంగాణ సర్కారు సెలవు ప్రకటించటం.. ఏపీ సర్కారు అందుకు భిన్నంగా ఉండటంతో.. ఆ ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది. తోటి తెలంగాణ ఉద్యోగులు సెలవుతో ఎంజాయ్ చేస్తుంటే.. ఏపీ క్యాడర్ ఉద్యోగులు మాత్రం పని చేయాల్సి రావటం కష్టమైన వ్యవహారమే సుమా.
Tags:    

Similar News