నిర్ణయం.. వివాదం.. ఓ కేసీఆర్..

Update: 2018-05-25 04:27 GMT
దేన్నైనా సరే ముందు ప్రజల్లోకి లీక్ చేయడం.. దానిపై ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడం.. ఒకవేళ వ్యతిరేక స్పందన వస్తే దాన్ని కరెక్ట్ చేయడం కేసీఆర్ అలవాటు.. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన కేసీఆర్ లోని ఈ ప్లాన్ ప్రతీ సారి అమలు చేస్తుంటారు. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి..

ఆ మధ్య తెలంగాణలో సారాకు ప్రత్యామ్మాయంగా 30 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని కేసీఆర్ లీకులు ఇచ్చారు. దానిపై గ్రామాల్లో మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. తెలంగాణను మద్యంలో ముంచుతావా అని విమర్శించారు. తీరిగ్గా తెల్లవారే ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ అసలు 30 రూపాయల లిక్కర్ ఆలోచనే లేదని ఇదంతా ఎవరో పుట్టిందని స్పష్టం చేశారు. ఇలాంటివి చాలా సార్లు కేసీఆర్ చేశారు..

అంతెందుకు రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ జోన్ల ఏర్పాటుపై తర్జనభర్జనలు కొనసాగాయి. కొన్ని జిల్లాలను పాత జోన్ నుంచి మరోజోన్ లో కలిపారు.   వికారాబాద్ జిల్లాను వెనుకబడిన మహబుబ్ నగర్ జోన్ లో కలుపబోతున్నట్టు లీకులు ఇచ్చారు కేసీఆర్. దానికి వికారాబాద్ జిల్లా సహా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల అసంతృప్తులు రోడ్డెక్కారు. మాకు ఈ జోన్లు వద్దంటూ నిరసనలు తెలిపారు. దీంతో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్న కేసీఆర్ నిన్న చాకచక్యంగా ఉమ్మడి జిల్లాలను బేస్ చేసుకొని ఏకంగా 7 జోన్లను తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. వాటికి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పేర్లు పెట్టారు.

కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ముందురోజు దాన్ని ప్రజల్లోకి వెళ్లేలా లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటు.. దానిపై ప్రజాస్పందనను బేరిజు వేసుకొని కరెక్షన్ చేసి మళ్లీ ఫ్రెష్ గా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా తనపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. అందుకే కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం హిట్ అవుతోంది. ఎంతైనా కేసీఆర్ అదృష్టవంతుడే మరి..

తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న జోన్లు ఇవీ..

జోన్     జిల్లాలు
1. కాళేశ్వరం: భూపాలపల్లి - మంచిర్యాల - కుమరం భీం - పెద్దపల్లి

2.బాసర: ఆదిలాబాద్ - నిర్మల్ - నిజామాబాద్ - జగిత్యాల

3.రాజన్న : కరీంనగర్ - సిద్దిపేట - సిరిసిల్ల - కామారెడ్డి

4.భద్రాద్రి : వరంగల్ గ్రామీణం - వరంగల్ అర్బన్ - కొత్తగూడెం - ఖమ్మం - మహబూబాబాద్

5.యాదాద్రి : సూర్యపేట - నల్లగొండ - యాదాద్రి భువనగిరి - జనగామ

6.చార్మినార్ : హైదరాబాద్ - రంగారెడ్డి - మేడ్చల్ - సంగారెడ్డి

7.జోగులాంబ: మహబూబ్ నగర్ - వనపర్తి - జోగులాంబ గద్వాల - నాగర్ కర్నూలు - వికారబాద్.
Tags:    

Similar News