తన సొంత నియోజకవర్గం గజ్వేల్ కు మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజక వర్గంలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వర్తించే ముఖ్యమైన పథకాన్ని తన ఇలాకా నుంచే ప్రకటించారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. దీంతో పాటుగా గజ్వేల్ నియోజక వర్గం లో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... కంటి వెలుగు పథకం మాదిరే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని కేసీఆర్ పేర్కొన్నారు. హెల్త్ ప్రొఫైల్ ప్రక్రియను గజ్వేల్ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరుతున్నాను అని తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్ ప్రొఫైల్ ఉంటుందని పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటిదే తెలంగాణ లోనూ అందుబాటులోకి రావాలన్నారు. ``కంటి వెలుగు పథకం మాదిరే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలి. ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రజలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రతి కుటుంబ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలి. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి.` అని పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలని, దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాలని కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే గజ్వేల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుందని అందులో గజ్వేల్ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుందాం అని కేసీఆర్ ప్రకటించారు.
ఇతరులు గజ్వేల్‌ను చూసి నేర్చుకోవాలనే విధంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకుందామని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ``ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా.. ఇప్పుడు అందరూ మనవాళ్లే. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది. ఆదర్శం ఉంటే అధికారులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేశమే ఆశ్చర్య పోయే విధంగా గజ్వేల్ లో అడవులను పునరుద్ధరిస్తున్నాం. గజ్వేల్ ను పచ్చగా చేయాలనుకున్నాం. చేసి చూపించాం.గజ్వేల్ నియోజక వర్గంలో 30 వేల ఎకరాల్లో అడవి విస్తరించింది. నియోజక వర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. గజ్వేల్‌లో ప్రతీ మనిషికి చేతినిండా పని ఉండాలి. ప్రతీ ఇల్లు పాడి పరిశ్రమలో కళకళలాడాలి.`` అని కేసీఆర్ ఆకాంక్షించారు.
ప్రజా జీవితం లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ విశ్రమించకూడదని కేసీఆర్ ఈ సందర్భంగా హితబోధ చేశారు. ``ప్రజల మధ్య ఉండే ఏ రాజకీయ నాయకుడూ రిలాక్స్ కావొద్దు. ఏ గ్రామంలో ఏ పని లేకుండా ఉన్నవాళ్లెవరు.. వాళ్లకేం పనివ్వాలో ఆలోచించాలి . ఏ గ్రామంలో ఏముంది.. ఏం కావాలి అనే విషయంపై అవగాహన రావాలి. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊరికి కథానాయకుడు కావాలి``అని సీఎం కేసీఆర్ చెప్పారు.