కొద్దిరోజులుగా చేస్తున్న భారీ కసరత్తు పూర్తి అయ్యింది. సోమవారం నుంచి అయుత చండీయాగానికి సంబంధించిన ప్రారంభ పూజ ప్రారంభమైంది. వాస్తవానికి చండీయాగం 23 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నప్పటికీ.. యాగానికి సంబంధించిన ప్రారంభ పూజ సోమవారంతో షురూ అయ్యింది. ఈ ప్రారంభ పూజ కోసం దాదాపు నాలుగు గంటల పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలో పాల్గొన్నారు. ఇక.. యాగానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. చండీయాగానికి వేదికగా మారిన ఎర్రవల్లిలో పండగ వాతావరణం మొదలైంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమేం చేశారు..? అయుత చండీయాగానికి సంబంధించిన అప్ డేట్స్ వివరాల్ని చూస్తే..
= సోమవారం ఉదయం గురు ప్రార్థన.. గణపతికి.. హోమగుండాలకు.. గోవుకు పూజలు. ఫుణ్యాహవచనం.. దేవనాంది.. ఆంకురారోపణ.. పంచగ్రవ్య మేళనం.. ప్రాశనం.. మహాసంకల్పం.. సహస్రమోదక మహా గణపతి హోమం.. మహా మంగళహారతి నిర్వహించారు.
= ఈ పూజల తర్వాత మధ్యాహ్నం నుంచి ఎర్రవల్లిలోని గ్రామ దేవతలు గండి మైసమ్మ.. పోచమ్మ ఆలయాల్లో పూజల్ని కేసీఆర్ దంపతులు చేశారు.
= యాగం కోసం వందలాది మంది రుత్వికులకు ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలన.
= వీవీఐపీల కోసం తయారు చేసిన గదుల్ని చెక్ చేశారు. ఏర్పాట్లకు సంబంధించిన మొత్తం వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.
= యాగాన్ని చూసేందుకు వీలుగా ప్రజల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. వీటిల్లో పదివేల మంది ప్రజలు కూర్చొని తిలకించే అవకాశం ఉంది.
= భోజనశాలలో ఏర్పాట్ల పరిశీలనతో పాటు.. అవసరమైతే మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని.. ఎవరికి ఎలాంటి లోటు రాకుండా చూడాలని ఆదేశించారు.
= గడిచిన ఇరవై రోజులుగా నిర్విరామంగా జరిగిన పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి.
= ఎర్రవెల్లి గ్రామ శివారు నుంచి చండీయాగ శోభ స్పష్టంగా కనిపిస్తోంది.
= చండీయాగానికి సంబంధించి స్వాగత తోరణాలు ఆకర్షణీయంగా ఉండటంతో పాటు.. ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం నుంచి రహదారికి ఇరువైపులా మొక్కల ఏర్పాటు పలువురిని ఆకర్షిస్తోంది.
= వీఐపీల కోసం ఏర్పాట్లు బాగున్నాయి.
= రుత్వికుల కోసం షెడ్లలో భారీ ఏర్పాట్లు చేయటంతో పాటు.. పచ్చని తివాచీలు పరిచిన వైనం బాగుంది. వారు ఉండేందుకు.. భోజనం చేసేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు.
= సోమవారం రాత్రి నుంచి యాగంలో కీలకపాత్ర పోషించే రుత్వికులు ఒక్కొక్కరిగా వస్తున్నారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు.
= క్యూ లైన్లను ఏర్పాటు చేయటంతో పాటు.. అన్నీ క్రమపద్ధతి సాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. యాగశాలకు వచ్చి.. తిరిగి బయటకు వెళ్లే సమయంలో భోజనశాలకు చేరుకునేలా చేసిన ఏర్పాటు ఎలాంటి కన్ఫ్యూజన్ కు అవకాశం లేకుండా ఉన్నాయి.
= భోజనశాలలో మొదట అనుకున్న దాని కంటే అంచనాను మరింత పెరిగింది. ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో.. ఇప్పటికే ఏర్పాటు చేసిన భోజనశాలకు రెండు వైపులా మరిన్ని టెంట్లు వేసి.. విస్తరిస్తున్నారు. తొలుత 50వేలమందికి భోజన సదుపాయం కల్పించాలని ఏర్పాట్లు చేశారు. తాజాగా దాన్ని మరింత ఎక్కువ చేయటం గమనార్హం.
= యాగశాలకు 2 నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ నుంచి యాగశాల దగ్గరకు చేర్చేందుకు వీలుగా.. ప్రత్యేక వాహనాల్ని ఏర్పాటు చేశారు.
= మొత్తానికి అయుత చండీయాగానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావటమే కాదు.. యాగం చూసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో చేసినట్లు కనిపిస్తుంది.