అయుత చండీ యాగం నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ సాకారమైతే ప్రయుత చండీ యాగం నిర్వహిస్తానని అన్నారు. ఇప్పుడు ఆయన ప్రకటనపై పండిత వర్గాల్లో ఆశ్చర్యం, విస్మయం వ్యక్తమవుతోంది. ఒకవేళ కేసీఆర్ కనక ప్రయుత చండీ యాగాన్ని నిర్వహిస్తే దానిని నిర్వహించిన వ్యక్తి దేశంలో ఆయన ఒక్కరే అవుతారేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి అయుత చండీ యాగం అంటే పది వేల సార్లు చండీ సప్తశతి పారాయణాలు చేయాలి. అదే నియుత చండీ యాగం అంటే లక్షసార్లు పారాయణాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయుత చండీ యాగం అంటే పది లక్షల సార్లు చండీ సప్తశతి పారాయణాలు చేయాల్సి ఉంటుంది. దాదాపు 700 శ్లోకాలున్న చండీ సప్తశతిని పారాయణ చేయడం అంటే మాటలు కాదు. అదే సమయంలో, చండీ సప్తశతిని పారాయణ చేయాలంటే బ్రాహ్మణులు అందరూ చేసే పని కాదు. చండీ ఉపాసన తీసుకున్న రుత్విక్కులు మాత్రమే దానిని చేయగలరు. మిగిలిన వారు అసలు దానిని చేయకూడదు. ఇక ప్రయుత చండీ యాగాన్ని నిర్వహించాలంటే దాదాపు లక్ష మంది చండీ ఉపాసన తీసుకున్న రుత్విక్కులు కావాలి. అంతమంది చండీ ఉపాసన తీసుకున్న రుత్విక్కులు లభించడం దాదాపు అసాధ్యమని పండిత వర్గాలు వివరిస్తున్నాయి.
అయితే, టీఆర్ ఎస్ వర్గాలు కానీ, అయుత చండీ యాగాన్ని నిర్వహించిన ప్రభుత్వ వర్గాలు కానీ కేసీఆర్ ప్రయుత చండీ యాగం అనే అన్నారని వివరిస్తున్నాయి. అయితే, ఇప్పటి తరహాలో ఐదు రోజుల్లో కాకుండా ఎక్కువ రోజుల్లో దానిని నిర్వహించాల్సి ఉంటుందని, అంత కాలం దానిని నిర్వహించడం కూడా అంత మంచిది కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రయుత చండీ యాగాన్ని కేసీఆర్ నిర్వహిస్తే మాత్రం ఆయన చరిత్రలో నిలిచిపోతారని వివరిస్తున్నాయి.