నైరుతి పెరిగింది.. వాస్తు దెబ్బతింది. అంతే పాత ఇంటిని కూలగొట్టి మళ్లీ కొత్త ఇంటిని కేసీఆర్ కట్టేస్తున్నారు. ఎవరి నమ్మకాలు వారివి.. ఎవరి సిద్ధాంతాలు వారివి. కానీ కేసీఆర్ వాస్తు నమ్మకం మాత్రం ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరిందనే చెప్పాలి..
ఒకటా రెండా.. ప్రస్తుతం వాస్తు వల్ల తెలంగాణకు కొత్త నిర్మాణాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తు సరిగా లేదని తెలంగాణ సచివాలయంలోకి అడుగుపెట్టలేదు కేసీఆర్. ఉమ్మడి సీఎం నివాసానికి కట్టిన బేంగంపేట సీఎం క్యాంప్ కార్యాలయం వదిలి విశాలంగా ప్రగతి భవన్ ను కట్టుకున్నారు.. సచివాలయానికి వెల్లకుండా ఇక్కడి నుంచే తెలంగాణను పాలిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపినా నో వే తన నమ్మకం తనదేనని కేసీఆర్ కదలడం లేదు..
ఇక వాస్తు సరిగాలేని అసెంబ్లీని, పాతసచివాలయాన్ని కూలగొట్టి కొత్తగా ఎర్రమంజిల్ లో అసెంబ్లీ, పాత స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణానికి కేసీఆర్ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. పాత సచివాలయం కూలగొట్టేపని కూడా మొదలైంది.
ఇప్పుడు కేసీఆర్ తన ఇంటిని వాస్తు కారణంగా కూలగొట్టేయడం విశేషంగా చెప్పవచ్చు. కేసీఆర్ కు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో జీప్లస్ 2 భవనం ఉంది. ఈ ఇంటిని వాస్తు సరిగా లేదని కూల్చేశారు. జూన్ 27నే మనవడితో కలిసి భూమిపూజ చేశారు. ఇంతకీ వాస్తు విషయంలో ఎంతో పక్కాగా ఉండే కేసీఆర్ ఆయన కట్టిన ఇంటిని ఆయనే ఎందుకు కూల్చివేస్తున్నాడన్న ప్రశ్న తలెత్తకమానదు. ఎందుకంటే నైరుతి దిశలో కేసీఆర్ కొన్ని ఎకరాల భూమిని తాజాగా కొనుగోలు చేశారట... దీంతో కేసీఆర్ ఇల్లు మధ్యలో లేకుండా పోయిందట.. వాస్తు దెబ్బతిందట.. దీంతో పాత ఇంటిని కూలగొట్టి నైరుతి దిశలో తన వ్యవసాయ పొలాలకు మధ్యలో సకల హంగులతో లిఫ్ట్, సహా అన్ని వసతులతో కొత్త ఇల్లును కడుతున్నారు.కేసీఆర్ రిటైర్ అయ్యాక ఇక్కడే ఉండేలా ప్రగతి భవన్ లా దీన్ని నిర్మిస్తున్నారట.. ఎక్కువ శాతం ఫాంహౌస్ లోనే ఉండే కేసీఆర్ ఈ మేరకు 4 నెలల్లోనే పూర్తి చేయడానికి రెడీ అయ్యారట..
ఇలా వాస్తు ఎఫెక్ట్ తో కేసీఆర్ తన సొంత ఇంటిని కూల్చి కొత్తది కడుతుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.