కేసీఆర్ దేశవ్యాప్త ప్లాన్ ఏంటి? ఎన్ని స్థానాల్లో పోటీ?

Update: 2022-10-01 13:37 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీపైనే ఇప్పుడంతా చర్చ సాగుతోంది. ఆయన పెట్టే కొత్త పార్టీ పేరేంటి? జెండా రంగు మారుతుందా? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్ కొత్త పార్టీ ‘బీఆర్ఎస్’పేరిట నమోదు చేయిస్తున్నారని.. భారతీయ రైతు సమితి  లేదా భారతీయ రాష్ట్రీయ సమితి గా ఉండొచ్చని ప్రచారం సాగుతోంది.

దసరా సందర్భంగా అక్టోబర్5న తెలంగాణ భవన్ లో జరిగే టీఆర్ఎస్ (టీఆర్ఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేస్తారు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తయిన ‘కారు’నే జాతీయ పార్టీకి కూడా తీర్మానం చేయనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు తెలిసింది.  పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులగా వారు పాల్గొంటారట.. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవంగా  ఆమోదించే తీర్మానాన్ని ఇప్పికే ఖరారు చేశారు. అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. పా్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావుతోపాటు రాష్ట్ర కార్యవర్గం ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేయనుంది.

కొత్త పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఎన్నిక కానున్నారు. రాష్ట్ర శాఖ బాధ్యతలను మంత్రి కేటీఆర్ కు అప్పగిస్తారని సమాచారం. దసరా తర్వాత కరీంనగర్ లో భారీ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశాక.. మొదటి బహిరంగ సభ కరీంనగర్ లోనేపెట్టారు. అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ.. కరీంనగర్ సభలోనే జాతీయపార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.

రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, బీసీల సమస్యలే కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండాగా ఉండబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో ఏయే పథకాలు అమలవుతున్నాయి? ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తే ఎలాంటి మార్పు వస్తుందన్న దానిని ఆయా రాష్ట్రాల ప్రజలకు వివరించనున్నారు.

దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో కనీసం 50 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.. పాత హైదరాబాద్ సంస్థానంలోని ప్రస్తుత తెలంగాణ, కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, ఉస్మానాబాద్, రాయిచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, పర్భణీ, నాందేడ్, బీడ్ ప్రాంతాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.

వీితోపాటు దేశవ్యాప్తంగా బలమైన రైతు ఉద్యమ నేతలు ఉన్న ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ రైతు ఉద్యమ నేతలను ఎన్నిక బరిలో దింపాలన్న  యోచనలో ఆయన ఉన్నారు.  2024 పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 50 లోక్ సభ స్థానాల్లో కారు గుర్తుపై అభ్యర్థులను దించేలా ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారట..

కర్ణాటకలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, గుజరాత్ లో ఆ రాష్ట్ర మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశముందని సమాచారం. ఏపీలోనూ కేసీఆర్ అభిమానులున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా కొన్ని సీట్లలో పోటీచేసే అవకాశముంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి.. ఫలితాల ఆధారంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News