కేసీఆర్ పంతం నెగ్గించుకున్నారు

Update: 2016-08-29 14:29 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పంతం మ‌రోమారు నెగ్గించుకున్నారు. జీఎస్‌ టీ బిల్లు నెగ్గేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అసెంబ్లీ తీర్మానం  కోసం అంటూ అసెంబ్లీ స‌మావేశాన్ని ఒక్క‌రోజు మాత్ర‌మే ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మైన కేసీఆర్ ముందు ప్ర‌తిపక్షాలు పొడ‌గింపు డిమాండ్‌ను పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా స‌మావేశ‌మైన తెలంగాణ కేబినెట్ ఈ మేర‌కు ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌ను ప‌క్క‌న పెట్టి సీఎం ఆలోచ‌న‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో అసెంబ్లీ స‌మావేశం ప్ర‌ధాన ఎజెండాగా చ‌ర్చించారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ, కేబినెట్‌ సమావేశంలో సమావేశాలను ఒక్క రోజుకే కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్‌ టీ బిల్లుకు స‌భ‌లో ఆమోదం తెలిపిన అనంత‌రం వాయిదా వేయాల‌ని ఈ సంద‌ర్భంగా నిర్ణ‌యించారు. ఇందుకోస‌మే ఒక్క రోజే అసెంబ్లీ సమావేశం నిర్వ‌హించ‌డం స‌మంజ‌స‌మ‌ని భావించారు. దీంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై కార్యదర్శులు - శాఖాధిపతులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ మేర‌కు కొత్త క‌మిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణ‌యించారు. కొత్త జిల్లా ఏర్పాటులో నూత‌న ప్ర‌తిపాద‌న‌ల‌ను సైతం స్వీక‌రించాల‌ని అభిప్రాయం ఈ సంద‌ర్భంగా వ్యక్త‌మైన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News