తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ తన ఎత్తుగడల్లో భాగంగా ముందస్తుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కరెంట్ విషయంలో భయంకరమైన సమస్యలు ఉండే అని సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని తాము చెప్తే.. అధి సాధ్యమవుతదా? అని జానారెడ్డి ప్రశ్నించారని సీఎం తెలిపారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తే.. తానే గులాబీ కండువా కప్పుకొని టీఆర్ ఎస్ తరపున ప్రచారం చేస్తానని జానారెడ్డి నిండు శాసనసభలో చెప్పిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. `ఆయనకు నిజాయితీ ఉంటే ఆ పని చేసి చూపించాలి. మాటకు కట్టుబడి జానారెడ్డి టీఆర్ ఎస్ తరపున ప్రచారం చేస్తారా? కరెంటు వెలుగులు జానారెడ్డికి కనబడక పోతే.. కంటివెలుగు ద్వారా చికిత్స చేయించుకోవాలి` అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ దరిద్రపు పాలన వల్లే ఒక్క హుస్నాబాద్ - తెలంగాణ కాదు.. యావత్ భారత్ మోసపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అవినీతి రహితంగా పాలన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని కేసీఆర్ తెలిపారు. `ఎలక్షన్ ఎందుకు వచ్చిందో నిన్ననే నేను చెప్పాను. తెలంగాణ అభివృద్ధి - సంక్షేమ పథకాలను మీరందరూ చూస్తున్నారు. చైతన్యవంతమైన ప్రజలు ఆలోచించాలి. ఎన్నికలు రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు రుజువు కాలేదు. సమైక్య పాలనలో శిథిలమైన తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎంత నాశనమైందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ హయాంలో సాలువారి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చేది? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడు క్రియాశీలకంగా పనిచేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదు`` అంటూ విరుచుకుపడ్డారు.
ప్రజలు ఎవరూ కలలో కూడా అనుకోని కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ వెల్లడించారు. ``కాంగ్రెస్ పాలనలో పైసలు తినడానికి - పైరవీలు చేయడానికి వారికి సమయం సరిపోలేదు. పెన్షన్ రూ.2వేలు ఇస్తామని హర్రాజ్ పాట పాడినట్లు పాడుతున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఏనాడైనా పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు ఇవ్వాలని మీ బుర్రలకు తట్టిందా. గౌరవెల్లి ప్రాజెక్టుపై మెదడు కరిగించి ఒక టీఎంసీ నుంచి ఎనిమిది టీఎంసీలకు తీసుకొచ్చినం. గౌరవెల్లి ప్రాజెక్టు కింద ప్రజల పొలాలు పారుతాయా... కేసీఆర్ పొలాలు పారుతాయా అని ప్రశ్నించారు. ఢిల్లీ నాయకులను చూడగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల లాగులు తడుస్తాయి` అని ఎద్దేవా చేశారు.