ఎన్నికల జోరు ఊపందుకుంది. తెలంగాణలో ఆ వేడి మరింతా రాజుకుంటోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావు ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. హైదారబాద్ శివార్లలో రాహుల్ గాంధీ బహిరంగా సభ జరుగుతున్న సమయంలో కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. " ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్దం మీరేంది సిద్దమా..? " అని ఛాలెంజ్ విసిరారు. సాధారణ ఎన్నికలు గడువుకు ఆరు నెలలు ముందు జరిగితే దానిని ముందస్తు అనరని ప్రకటించారు. ఈ ప్రకటనతో ముందస్తుకు వెళ్తామనే సంకేతాన్ని ఇచ్చారు. అంతేగాదు సెప్టెంబరు నెలలోనే అభ్యర్థులను సైతం ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబరు 2 వ తేదీన హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలసి ఎన్నికల పొత్తు కుదుర్చుకుందామనుకుంటున్న నేపథ్యంలో టీఆర్ఎస్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుందని కె. చంద్రశేఖర రావు ప్రకటించడం కూడా కేసీఆర్ వ్యూహమే.
ఏదో ఒక అలజడి నిర్ణయాలతో కేసీఆర్ ఎప్పటికపుడు జనాలను ఎంగేజ్ చేస్తుంటారు. గతంలో ఇలాగే... కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ - ప్రతిపక్ష కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆయన, ఆయన వారసులు - అనుచరులు కొంతకాలం దానిని మారుమోగించారు. సడెన్ ఓ రోజు మోడీ మనిషిగా మారిపోయారు. అలా ప్రతిపక్షాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారాయన.
ఇక తెలంగాణలో ముఖ్యమైన ఆంధ్రుల ఓట్లపై కూడా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కన్నేసారు. సెటిలర్ల ఓట్లతో అధికారంలోకి వస్తామన్న కాంగ్రెస్ ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లే ప్రయత్నం చేసారు. దశాబ్దాలుగా తెలంగాణలో ఉంటున్నవారంతా ఇక్కడి వారేనని ఆంధ్రులను ఉద్దేశించి అన్నారు. తమకు ఎలాంటి భేధభావము లేదని తెలంగాణలో ఉన్న వారందరిని అక్కున చేర్చుకుంటామని చెప్పారు. అంతేకాదు ఇన్నాళ్లు రాష్ట్రాలు ఢిల్లీ ఆదేశాల మేరకే ఉన్నాయని ఇక ముందు తాము ఎవరి ఆధీనంలోను ఉండమని స్పష్టం చేశారు. అభ్యర్దులను ముందే ప్రకటించి తాము ఎన్నికల బరిలో నిలుస్తామని, వందకు పైగా సీట్లు సాధిస్తామని కేసీఆర్ ప్రకటించడం వెనుక ఆయన ఆత్మవిశ్వాసం కనబడుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జాతీయ స్దాయిలో కాంగ్రెస్ పార్టీ గడచిన నాలుగేళ్లలో తాము భర్తీ చేసిన ఉద్యోగాలను లెక్కలు తీయాలని దాంతో తామేమిటో రుజువవుతుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతైన జైపాల్ రెడ్డిని సైతం కేసీఆర్ వదలలేదు. జైపాల్‌రెడ్డి తన స్దాయిని మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పనిలో పనిగా ఎన్నికల వరాలను సైతం కేసీఆర్ గుప్పించారు. హైదారబాద్ మహానగరాన్ని మరింత అభివ్రుద్ది చేసేందుకు 50 వేల కోట్లు కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు. తాను స్పష్టమైన రాజకీయాలు చేస్తానని అవి ఎన్నికలకే పరిమితమవుతాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత అభివ్రుద్దే ధ్యేయమని ప్రకటించారు.