తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర సవాల్ విసిరారు. మహారాష్ట్రతో గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం చేసుకుని వచ్చిన సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని యావత్ తెలంగాణ హర్షిస్తా ఉంటే - రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తా ఉంటే - కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం నల్లజెండాలు కనిపిస్తున్నయని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎంతో ఓర్పుతో - సంయమనంతో - సామరస్యంతో - డిప్లమసితో ఒకటిన్నర సంవత్సరం పాటు మంత్రులు - అధికారులు - ఇంజనీర్లు కష్టపడి సాగునీటి ప్రాజెక్టులకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నరని కేసీఆర్ మండిపడ్డారు. అబద్దాలు మాట్లాడటానికి ఒక హద్దు - ఆధారం ఉండాలని - రాజకీయం మాట్లాడినా దానికవసరమైన పరిజ్ఞానం - తెలివి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
రైతుల కష్టాలను శాశ్వతంగా దూరం చేయడానికి - తెలంగాణకు పక్కా ప్రణాళికతో నీళ్లు తీసుకొస్తుంటే వాస్తవాలను పక్కనబెట్టి అబద్దాలు మాట్లాతున్నరని కేసీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు పదవుల్లో కులుకుతూ - పైరవీలు చేసుకుంటు తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ - ఆతర్వాత 18 ఏళ్లు పాలించిన టీడీపీలు కాదా? అని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్ పీ లీడర్ జానారెడ్డిపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఓర్వలేక అసత్యాలు పదే పదే చెబుతూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తునారని ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఇదే ఉత్తమ్ - జానాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేసిందని - 152 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓప్పందం చేసుకుందని ఉత్తమ్ అండ్ కో మాట్లాడుతున్నారన్నారు. "తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోంది. ఏ ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ కలిసిరావడం లేదు. మాపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిందే నిజమైతే ఇటు నుంచే రాజ్ భవన్ కు పోయి రాజీనామా సమర్పిస్తా. ఇంకా గంట సేపు బేగంపేటలో ఉంటానని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేటకు రా" అంటూ సవాల్ విసిరారు.
98 లక్షల ఎకరాలకు నీరిస్తే అవి ఎటుపోయాయని ప్రశ్నిస్తూ పిట్టలు తాగినయా అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. నీళ్లిచ్చింది నిజమైతే తెలంగాణకు ఈ గోస ఎందుకుంటుండే.. అని కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ సన్నాసుల వల్లే తెలంగాణ ఆగమయిందని - ఇవాళ తెలంగాణను బాగుచేసుకునే పనిలో తండ్లాడుతుంటే ఓర్వలేక అడ్డుపడుతున్నరని ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ ఎస్ పార్టీ కొట్లాడుతుంటే ఇదే కాంగ్రెస్ దద్దమ్మలు ఆనాడు ఎగతాలి చేశారని - ఆంధ్రా ముఖ్యమంత్రుల సంకలో చేరి తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ మండిపడ్డారు.