హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందన్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూ మీద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కమ్ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మొదలుకొని పలు రాజకీయ పక్షాల అధినేతలు.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రియాక్ట్ కావటం.. కొందరైతే స్వయంగా హైదరాబాద్ కు వచ్చి మరీ తమ మద్దతును ప్రకటించి వెళ్లటం తెలిసిందే.
ఈ ఉదంతం మీద మొదట్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత రియాక్ట్ అయ్యారు. సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ గురించి సమాచారం తమ వద్ద ఉందని.. విద్యార్థుల రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తలదూర్చటం ఇష్టం లేకనే మౌనంగా ఉన్నామని.. కానీ.. రోహిత్ ఇష్యూలో తప్పు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయదేనని తేల్చారు.
కేసీఆర్ కు క్లోజ్ అయిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీద కవితక్క అంతలా ఫైర్ అవ్వటం పలువురిని విస్మయానికి గురి చేసింది. రాజకీయంగా కేసీఆర్ కు వెనుదన్నుగా ఉండటంతో పాటు.. బీజేపీ అధినాయకత్వంతో ‘టచ్’ లో ఉండటానికి కీలకమైన దత్తాత్రేయ విషయంలో కవితక్క నోరు పారేసుకోవటంపై కమలనాథులు కొందరు అగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. కవితక్క మాటల మీదన కమలనాథులే కాదు.. కేసీఆర్ కూడా అగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
రోహిత్ ఇష్యూలో మౌనంగా ఉండే వ్యూహాన్ని అనుసరిస్తున్న ఆయన.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కామ్ గా ఉంటున్నారు. అసలేం జరగలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తానంత వ్యూహాత్మకంగా ఉంటే.. తన కుమార్తె ఈ ఇష్యూ మీద రచ్చ పెరిగేలా మాట్లాడటంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ ఇష్యూ మీద నోరు విప్పొద్దని కవితకు కేసీఆర్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ కారణం చేతనే.. రోహిత్ ఇష్యూలో మొదట రియాక్ట్ అయిన కవితక్క తర్వాత కామ్ అయిపోయారన్న మాట వినిపిస్తోంది.