బీజేపీ జాడ‌ లేక‌పోతే అంత‌ వ‌ణుకు ఎందుకు?

Update: 2018-10-04 01:30 GMT
తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ ర‌థ‌సార‌థి కేసీఆర్ మ‌రోమారు విప‌క్షాల తీరుపై మండిప‌డ్డారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో విప‌క్షాలు సైతం మండిప‌డుతున్నాయి. బీజేపీ అనే ఓ పార్టీ ఉన్నది - అది యాడున్నదో ఎవనికి తలవదు అని నిజామాబాద్‌ లో కేసీఆర్ వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్‌ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో మండిప‌డ్డారు. కేసీఆర్ ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ నేత‌లు వ్యాఖ్యానించారు.

బీజేపీ యాడలేకపోతే ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులకు పొర్లు దండాలు ఎందుకు పెడుతున్నావ్? బీజేపీ యాడలేకపోతే బీజేపీ అంటే నీకెందుకు అంత వణుకు పుడుతుంది? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ``లక్ష్మణ్ ఎవని కిరాయి కడుతాడో ఎం కడుతాడో అని కేసీఆర్ అవాకులు చవాకులు పేళుతున్నారు. కేసీఆర్ గారు - నీకర్ధం కాలేదు కావచ్చు. కానీ, ఈ రాష్ట్రంలోని ప్రతి పేదకు అర్ధమయింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతి పేదకు ఇల్లు కట్టిస్తాం. కట్టించే వరకు కిరాయి కడుతాం అని ప్రతి పేదకు అర్ధమయింది.. అయినా - 50 గదుల విశాలమైన ప్రగతి భవన్ లో ఉండే నీకేం తెలుస్తుంది ఇల్లు లేని పేదల బాధ? ప్రతి పేదకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అని పెదాలను మోసం చేసిన మీకు ఎం తెలుస్తుంది వారి బాధ. కిరాయి కట్టడం సాధ్యం కాదు అని కేసీఆర్ ఎలా మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 25 వేల కోట్లు రూపాయల రాజకీయ అవినీతి జరుగుతుంది. రాజకీయ నేతలు స్వాహా చేస్తున్నారు. మేము వస్తే ఆ రాజకీయ అవినీతిని నిర్మూలిస్తాం. రాజకీయ అవినీతిని నిర్మూలిస్తే ఇలాంటి స్కీంలు ఇంకా పది అమలు చేయొచ్చు. రాబోయే కొద్దీ రోజుల్లో ఇలాంటి మరిన్ని హామీలతో బీజేపీ ప్రజల ముందుకు వస్తుంది`` అని కేసీఆర్ తీరును బీజేపీ ఎద్దేవా చేసింది.

ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ స్కీం అని ఎందుకు కేసీఆర్‌ కు అంత ఆశ్చర్యమ‌ని బీజేపీ ప్ర‌శ్నించారు. ``ప్ర‌పంచంలో ఎక్కడ లేదు కాబట్టే బీజేపీ ఈ అంశాన్ని ప్రజల ముందు పెట్టింది. పేద ప్రజల నుండి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకే కేసీఆర్ బీజేపీ మీద వాక్కులు చవాకులు పేలుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్ననాడు ఎం చేయలేదు అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు అన్నారు ...మేము అధికారంలోకి వచ్చాక రాజకీయ అవినీతిని తగ్గించాం. నీలా స్కీంలు పెట్టి స్కాం లు చేయలేదు. నీలా కుటుంబ రాజకీయాలు చేయలేదు... దేశంలో రాజకీయ అవినీతిని తగ్గించినం. ఆ డబ్బులతో పేదలకు ఉచితంగా 32 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు - 15 కోట్ల మందికి చౌక ధరలో భీమా - కోట్ల మందికి ఇల్లు - మరుగుదొడ్లు - వంట గ్యాస్‌ లు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. మేము వచ్చాకనే విద్యుత్తు సమస్యను పరిష్కరించాం, యూరియా సమస్యను పరిష్కరించాం, రుణ సమస్యను పరిష్కరించాం. ఇలా మేము వచ్చాక ఏమేం చేసామో 100 చెబుతాం.. మీరు చిత్తశుద్ధితో చేసినవి 10 అయినా చెప్పండి`` అని ప్ర‌శ్నించారు.

చెప్పటోనికి చెవిటి అయినా వినటానికి ఇజ్జతి ఉండాలి అని కేసీఆర్ అంటున్నార‌ని ముందు త‌న గురించి ఆలోచించాల‌న్నారు. ``దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా - దళితులకు మూడు ఎకరాల భూమి - పేదలకు రెండు గదుల ఇల్లు - యువతకు ఇంటికో ఉద్యోగం అనే హామీలు విని ఓట్లు వేసిన ప్రజలకు యుజ్జతి లేదనా నీ అభిప్రాయం? ప్రజలు విజ్ఞులు . ప్రజలను కించపరిచే నీ అహంకారాన్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో అణిచివేస్తారు. వినేటోళ్లు కాదు చెప్పేటోళ్లకు చిత్తశుద్ధి - ఇజ్జతి ఉండాలి అనే విషయాన్ని గమనించండి. ఆ చిత్తశుద్ధి బీజేపీకి ఉంది`` అని బీజేపీ నేత‌లు వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News