లాక్ డౌన్ ఎత్తేసి ఆ తప్పును సరిదిద్దుకున్నకేసీఆర్

Update: 2021-06-20 09:15 GMT
తప్పులు అందరూ చేస్తారు. దాన్ని సరి చేసుకోవటం మాత్రం కొందరే చేస్తారు. ఎంతసేపటికి జరిగిన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసే వారు.. తప్పును సరి చేసే దాని మీద ఫోకస్ పెట్టరు. అందుకు భిన్నంగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇప్పుడు పలువురు అభినందిస్తున్నారు. దేశ వ్యాప్తంగాకేసులు అంతకంతకూ పెరగటమే  కాదు.. తెలంగాణలోనూ పాజిటివ్ లు ఎక్కువ అవుతున్న వేళ.. లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం సానుకూలంగా లేదన్న సంగతి తెలిసిందే. చివరకు తెలంగాణ హైకోర్టు కలుగజేసుకొని కేసీఆర్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేయటాన్ని మర్చిపోకూడదు.

లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక ఇబ్బందులతో పాటు.. మళ్లీ ఎప్పటికి తెలంగాణ కోలుకుంటుందన్న ఆందోళన కేసీఆర్ లో ఉన్నట్లు చెబుతారు. ఈ కారణంతోనే అప్పటికి తగ్గ మాటలు చెప్పి.. లాక్ డౌన్ విధింపులో మీనమేషాలు లెక్కేస్తూ  ఉండటంతో తప్పు జరిగిపోయిది.. దీంతో.. రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఈసందర్భంగా కేసీఆర్ తన దగ్గర ఉన్న లెక్కల్ని వదిలేసి.. లాక్ డౌన్ పరిస్థితి మీద ఫోకస్ పెట్టారు. తీవ్రతను గుర్తించిన ఆయన ఎట్టకేలకు లాక్ డౌన్ కు ఓకే చెప్పేశారు.

ఇదిలా ఉంటే.. గడిచిన వారంలో దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగానమోదైన కేసుల్నిచూస్తే.. 81 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కేసుల నమోదు భారీగా తగ్గింది. రోజుకు 50 వేల దిగువకు వెళ్లటం గమనార్హం. ఇదిలా ఉండగా.. కరోనా తీవ్రత తగ్గుతున్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లాక్ డౌన్ ను ఎత్తేసినట్లుగా ప్రకటించారు. అన్నింటికి ద్వారాలు ఎత్తేశారు.

లాక్ డౌన్ ను అమలు చేసే విషయానికి సంబంధించి సీఎం తాజా నిర్ణయంపై వ్యాపార.. పారిశ్రామిక వర్గాలు మొదలుకొని బడుగు జీవుల వరకు సంతోషపడే పరిస్థితి. మూడో వేవ్ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగటం లాంటివి చోటు చేసుకుంటే మరో ఆలోచన లేకుండా లాక్ డౌన్ విధిస్తామని పేర్కొన్న వైనం చూస్తే.. లాక్ డౌన్ ను విధించే విషయంలో కేసీఆర్ చేసిన తప్పును లాక్ డౌన్ ఎత్తేయటం ద్వారా సరిదిద్దుకున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News