కారు అధినేతకు కారు లేదు

Update: 2018-11-15 04:04 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆస్తులు 20 కోట్ల 60 లక్షలు మాత్రమే. ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ సాధనే లక్ష్యంగా పని చేసిన కేసీఆర్‌ కు కాని - ఆయన భార్యకు కాని కనీసం కారు కూడా లేదు. నిరాడబరంగా ప్రజలకోసం మాత్రమే జీవిస్తున్నట్లుగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు. బుధవారం గజ్వేల్ శాసనసభకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు కెసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ తన ఆస్తుల వివరాలను నిజాయితీగా వెల్లడించారు. తన మొత్తం ఆస్తులలో 10.40 కోట్ల విలువైన చరఆస్తులు ఉన్నాయని 94.5 లక్షల విలువైన ఆస్తులు తన భార్య శోభ పేరిట ఉన్నాయని అఫిడివిట్‌ లో పేర్కొన్నారు. 12.20 కోట్ల విలువ చేసే స్దిరాస్తులు ఉన్నాయని - అందులో 6.50 కోట్లు విలువ చేసే 54 ఎకరాలు వ్యవసాయ భూమి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తాను రైతునని - రైతు కుటుంబమే తన నేపథ్యమని సగర్వంగా అఫిడివిట్‌ లో పేర్కొన్నారు.

ఒకప్పుడు వ్యవసాయం దండగా అని ప్రకటించిన తెలుగుదేశం పార్టీతో విభేధించి బయటకు వచ్చిన కె. చంద్రశేఖర రావు - తాను రైతునంటూ అఫిడివిట్‌ లో పేర్కొనడంపై రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. గడచిన సంత్సరం అనగా 2017-18 సంవత్సరంలో 2.07 కోట్ల ఆదాయం వచ్చిందని - అందులో తనకు వ్యవసాయం నుంచి 91.52 లక్షలు ఆదాయం సమకూరిందని చంద్రశేఖర రావు పేర్కొన్నారు.  తెలంగాణ ప్రసార సమితిలో తనకు 5.10 కోట్ల విలువగల షేర్లు ఉన్నాయని - పలు బ్యాంకులలో  5.63 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. తనకు హైదారాబాదులోను - కరీంనగర్‌ లోను రెండు నివాస గ్రుహాలు ఉన్నాయని - వాటి విలువ 5.10 కోట్లు అని తెలిపారు. అంతే కాకుండా 2.40 లక్షల విలువ చేసే 75 గ్రాములు బంగారం ఉందని - మరో 2.40 లక్షల నగదు ఉందని అఫిడివిట్‌ లో పేర్కొన్నారు. తన భార్య శోభకు 93,66,184 రుపాయల విలువ చేసే బంగారం - వజ్రాలు - మరో 93,595 రుపాయల నగదు ఉన్నాయని తెలిపారు. తన పేరిట 8.88 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు తెలిపారు. తనకు ఎటువంటి బ్యాంకు రుణాలు లేవని అఫిడివిట్‌ లో తెలిపారు. గత  ఎన్నికలలో అంటే 2014లో చంద్రశేఖర రావు ఆయన ఆస్తుల విలువ 16.94 కోట్ల రూపాయలుగా అప్పట్లో పేర్కొన్నారు.  2013-14 సంవత్సరంలో తన ఆదాయం 6.59 లక్షలుగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 64 కేసులు నమోదు అయ్యాయని - అయితే వాటిని సంబంధించి ఎటువంటి సమన్లు జారీ చేయలేదని తన అఫిడివిట్‌ లో పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో తన ఆస్తులు ప్రకటించిన  తెలంగాణ అధ్యక్షుడు  తన పార్టీ గర్తు అయిన కారు కూడా తనకు లేదని - ఈ ఎన్నికల అఫిడివిట్‌ లో పేర్కొనడం  ముక్తాయింపు.


Tags:    

Similar News