అయ్యిందమ్మా పెళ్లి.. అన్నట్టుగా ఉంది.. సీఎం కేసీఆర్ పరిస్థితి! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజమే నని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆయన టీఆర్ ఎస్ పార్టీని బీఆర్ ఎస్‌గా మార్చుకుని ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే.. ఈ పర్యటనతోనే ఆయన జాతీయ స్థాయిలో సంచలనం అవుతారనే ప్రచారం జరిగింది. కార్యాలయం ప్రారంభించడంతోపాటు.. ఆయన సభలు, సమావేశాలు పెట్టి.. దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తారని అనుకున్నారు.
అంతేకాదు.. ఈ సందర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించిన కొన్ని నియామకాలను కూడా చేస్తారని లెక్కలు వేసుకున్నవారు ఉన్నారు. ఇక, కేసీఆర్ పార్టీ ప్రారంభించడంతో.. ఆయనకు మద్దతు దారులు పెరుగుతారని.. భారీ లెవిల్లో ఆయనను కలుసుకునేందుకు, ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు లేదా.. కొత్తవర్గాన్ని ఎంచుకునేందుకు వారు పోటీ పడతారని కూడా అనుకున్నవారు ఉన్నారు.
దీంతో కేసీఆర్ ఢిల్లీ పర్యటన, బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున హైప్ వచ్చేసింది. కానీ, ఇంతా చేస్తే.. కేసీఆర్ ఢిల్లీ టూర్ మూడునాళ్ల ముచ్చటగాను.. అయ్యిందమ్మా పెళ్లి.. అన్నట్టుగాను మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయనను కలుసుకునేందుకు పెద్దగా జాతీయ నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. ముఖ్యంగా బలమైన నాయకుడుగా ఉన్న బిహార్ సీఎం నితీష్ కుమార్ వస్తారని కేసీఆర్ కూడా ఆశలు పెట్టుకున్నారు.
కానీ, ఆయన వేరు కుంపటి పెట్టుకుంటున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా భారీ మద్దతు లభిస్తుందని ఆశించినా.. కేసీఆర్‌కు ఆ తరహా మద్దతు లభించలేదు. దీంతో కేసీఆర్ అనుకున్న విధంగా ఢిల్లీ టూర్ నడవలేదు.
అంతేకాదు, ఆయనకు మద్దతుగా కీలక నేతలు ఎవరూ రాకపోయినా.. కనీసం వారి వారి రాష్ట్రాల నుంచి అయినా.. మద్దతుగా వ్యాఖ్యలు చేయలేదు. ట్వీట్లు అంతకన్నా కురవలేదు. కేవలం హైదరాబాద్ నుంచి వెళ్లిన టీఆర్ ఎస్ నాయకులు మాత్రమే శాలువాలు కప్పి.. పుష్పగుచ్చాలు అందించి.. చప్పట్లు కొట్టారు. దీంతో కేసీఆర్ తిరుగు టపాలో వెనక్కి వచ్చారని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.