తెలుగు వారికి సత్తా లేదని ఎవరు అన్నారు. స్వాతంత్ర పోరాటం నుంచి దేశంలో తెలుగు వారిదే అతి పెద్ద పోరాటం. ఇక దక్షిణాన కూడా తెలుగు వారిదే కీలక భూమిక.
జాతీయ రాజకీయాల్లో కూడా వారు ప్రముఖ పాత్ర పోషించారు. అయితే అత్యున్నత సింహాసనం ప్రధాని పదవి మాత్రం ఒకే ఒకసారి దక్కింది. నాడు ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాక జాతీయ రాజకీయాల మీద అమితమైన ఆసక్తి చూపించారు.
ఆయన విజయవాడలో 1984లో ప్రతిపక్ష నాయకులను అందరినీ పిలిచి సభ పెడితే నాటి ప్రధాని ఇందిరాగాంధీ గట్టి నిఘా పెట్టి మొత్తం అంతా పరిశీలించే దాకా సీన్ వెళ్లింది ఇక ఎన్టీయార్ నాడు విజయవాడలో ఏర్పాటు చేసిన విందుకు బీజేపీ అగ్ర నేతలు వాజ్ పేయ్ అద్వానీ, చంద్రశేఖర్ సహా వామపక్ష నాయకులు ఉద్ధండులు ఎందరో వచ్చారు.
నాడు ఎన్టీయార్ ప్రతీ వారి వద్దకు వెళ్లి భోజనం వడ్డించారు. అలాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీయార్ హైదరాబాద్ లో అనేక సార్లు విపక్ష నేతలను పిలిచి విందు ఇచ్చారు. వారితో సరదాగా గడిపారు. ఆ తరువాత 1989 ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ సూపర్ హిట్ అయి కేంద్రంలో వీపీ సింగ్ ప్రధాని అయ్యారు కూడా.
ఇపుడు చూస్తే అదే తీరున తెలంగాణా సీఎం కేసీయార్ కూడా దేశంలోని విపక్ష నేతలతో విందు రాజకీయం నెరపుతున్నారు. ఆయన విందులో తెలంగాణా రుచులు అన్నీ ఘుమఘుమలాడాయి. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు తమిళనాడుకు చెందిన ప్రాంతీయ పార్టీ నేతలు ఈ విందులో పాలు పంచుకున్నారు.
కేసీయార్ ఉత్సాహాం ఆయన ఆసక్తిని చూస్తూంటే నాడు ఎన్టీయార్ విందు రాజకీయాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికి ముప్పయి ఎనిమిదేళ్ల క్రితం ఎన్టీయార్ చేసిన విందు రాజకీయాన్ని ఇపుడు కేసీయార్ చేస్తూ ఆయన్ని అనుసరిస్తున్నారు అంటున్నారు. ఇంతకీ కేసీయార్ కూడా టీడీపీకి చెందిన వారే కదా. అదీ విషయం అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.