కేసీయార్ వివక్ష బయటపడిందా ?

Update: 2023-04-21 12:00 GMT
ఆంధ్రోళ్ళ విషయంలో కేసీయార్ వివక్ష మరోసారి బయటపడింది. ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ ను జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చినా కేసీయార్ ఆలోచనలో మాత్రం ఎలాంటి మార్పురాలేదని అర్ధమవుతోంది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల్లో కేసీయార్ కు ఆంధ్రోళ్ళ ఓట్లు కావాలి కాని వాళ్ళకు కనీస మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదన్నది కేసీయార్ మనోగతంగా బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే కొత్తగా నిర్మించిన సచివాలయం ఎదురుగా ఉండే మూడు విగ్రహాలు మాయమైపోయాయి.

సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో తెలుగుతల్లి, నీలం సంజీవరెడ్డి, పొట్టి శ్రీరాములు విగ్రహాలు దశాబ్దాలుగా అట్రాక్షన్ గా ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలను పార్కు బ్యూటిఫికేషన్ పేరుతో విగ్రహాలను తొలగించారు.  పనులను పర్యవేక్షిస్తున్న ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులకు కూడా తెలియకుండానే విగ్రహాలను మాయంచేసేశారు. తీసేసిన విగ్రహాలను ఎక్కడ దాచారు ? పార్కు పనులు పూర్తయిన తర్వాత  మళ్ళీ యథాస్ధితిలో పెడతారా లేదా అన్నది సస్పెన్సుగా మారిపోయింది.

మాయమైన విగ్రహాల గురించి ఎంతమంది ఎన్నిసార్లు అడుగుతున్నా ప్రభుత్వం నుండి సమాధానం రావటంలేదు. దాంతో ప్రభుత్వ పెద్దల సూచనలతోనే విగ్రహాలను తొలగించారని అందరికీ అర్ధమైపోయింది. ఇక్కడే అందరికీ కేసీయార్ వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఏపీ ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్న కేసీయార్ దేశాధ్యక్షుడిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డికి ప్రత్యేకరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్షచేసి ప్రాణాలు పోగొట్టుకున్న పొట్టి శ్రీరాములుకు ఇచ్చే గౌరవం ఇదేనా అని జనాలు మండిపోతున్నారు.

సమైక్య రాష్ట్రానికి ప్రతీకగా తెలుగుతల్లి దశాబ్దాల పాటు అలరారింది. తెలుగుతల్లి పేరుతో పెద్ద విగ్రహాన్ని కూడా నాటి పాలకులు ఏర్పాటుచేశారు. బ్యూటిషికేషన్ పనుల కారణంగా ఈ విగ్రహాలను తొలగించటంలో తప్పులేదు.

కానీ ఆ విగ్రహాలను పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసిన చోటే ప్రతిష్టామని ప్రభుత్వం ప్రకటిస్తే జనాలు హ్యాపీగా ఫీలవుతారు. కానీ జనాలకు ఏ విషయమూ చెప్పకుండా డార్కులో ఉంచేసింది కాబట్టే అసహనం పెరిగిపోతోంది. ఇప్పటికైనా మూడు విగ్రహాల ఏర్పాటుపై ప్రభుత్వం ఒక ప్రకటనచేస్తే బాగుంటుంది.

Similar News