ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసింత చిత్రమైన కండీషన్లో చిక్కుకున్న ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ అధికారిక నివాసంలో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు హాజరుకావటం తెలిసిందే. పాత పంచాయితీల్ని పక్కన పెట్టేసుకొని.. కులాశాగా కబుర్లు చెప్పుకున్న వీరిద్దరిని.. గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిగా సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా హైకోర్టు విభజన అంశాన్ని కేసీఆర్ తెర మీదకు తీసుకొచ్చారని.. తనదైన శైలిలో బాబును ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. హైకోర్టు విభజన విషయంలో తమకు సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ కోరారట. ఈ సందర్భం గా కేసీఆర్ వాదనకు చంద్రబాబు సమాధానం చెప్పే విషయంలో కాసింత ఇబ్బందికి గురి అయినట్లు తెలుస్తోంది.
ఏదో ఒక రోజున విడిపోవాల్సి ఉంది కనుక.. ఇప్పుడే విడిపోయేందుకు తమకు సహకరించాలని కేసీఆర్ కోరగా.. దానికి బదులుగా బాబు స్పందిస్తూ.. గతంలో సెక్రటేరియట్ లో భవనాల విషయాన్ని తెచ్చారని.. ఇప్పుడు హైకోర్టు ఇష్యూ అంటున్నారని.. అలా కాకుండా ఉన్న అన్ని ఇష్యూలను ఒకేసారి తేల్చేసుకుందామంటూ పాత పాటను పాడినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా బాబు మాటలకు కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీన్ని గుర్తించిన చంద్రబాబు.. అనునయంగా.. పదో షెడ్యూల్ లో పెద్ద సంఖ్యలో ఉమ్మడి సంస్థలు ఉన్నాయని.. వాటికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయని.. అలాంటి అంశాలన్నింటిని ఒకేసారి పరిష్కరించుకుందామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య ఎంతకూ పంచాయితీ తెగని నేపథ్యంలో కలుగజేసుకున్న గవర్నర్.. పట్టుదలలకు పోకుండా.. పరిష్కారం దిశగా అడుగులు వేయాలని సూచించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీదా బాబును ఫిక్స్ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని.. అయినా తమ ముఖ్యమంత్రి అలాంటి అవకాశం ఇవ్వలేదని తెలుగు తమ్ముళ్లు చెప్పుకోవటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/