అప్పుడు ర‌త‌న్ టాటా.. ఇప్పుడు ఇవాంక

Update: 2017-11-30 04:33 GMT
విశిష్ఠ అతిధి రాష్ట్రానికి వ‌స్తే వెన్నంటి ఉండ‌టం ఒక ప‌ద్ద‌తి. ఆ.. వ‌చ్చారా..?  వెళ్లారా? అన్నట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం మ‌రో ప‌ద్ధ‌తి.  కానీ..తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు ఈ రెండింటికి భిన్నం. ట‌చ్ మీ నాట్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూనే.. అనుభూతుల కొండ‌ను  వారి మ‌నుసుల మీద వేసే తీరు ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంది. రాష్ట్రానికి వ‌చ్చిన  అతిధికి స్వాగ‌త స‌త్కారాల‌తో మైమ‌రిచిపోయేలా చేయ‌టం.. వారు వ‌చ్చింది మొద‌లు తిరిగి వెళ్లే వ‌ర‌కూ వెంటే ఉండి.. వారికి తామిచ్చే ప్రాధాన్య‌త ఎంత‌న్న విష‌యాన్ని తెలిసేలా చేసే నాటు ప‌ద్ధ‌తి కేసీఆర్‌ కు పెద్ద‌గా ఇష్టం ఉండ‌ద‌న్న‌ట్లుగా ఉంటుంది ఆయ‌న తీరు.

అలా అని వ‌చ్చిన అతిధిని గాలికి వ‌దిలేసిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరు కూడా ఆయ‌న‌లో క‌నిపించ‌దు. వ‌చ్చిన అతిధికి స‌ర్వం స‌మ‌కూరుస్తూ.. అతిధి మ‌ర్యాద‌ల్లో మైమ‌రచిపోయేలా చేస్తూనే.. తాను మాత్రం అంటీముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే విల‌క్ష‌ణ‌మైన తీరు కేసీఆర్ లో క‌నిపిస్తుంది. ఇవాంక లాంటి అతిధి హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన‌ప్పుడు వీలైనంత ఎక్కువ‌గా ఆమె వెంట ఉండే ధోర‌ణికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు కేసీఆర్‌.. ఆమెను క‌లిసే అవ‌కాశాలున్నా వాటిని ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. అలా అని ఎక్క‌డా ఏ లోటు లేకుండా చూసుకుంటూ.. అతిధ్యంతో ఆమె మ‌న‌సును దోచుకున్న ఆయ‌న‌.. ప‌రిమిత స‌మ‌యాల్లో మాత్ర‌మే తాను ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం క‌నిపిస్తుంది.

నిజానికి ఈ త‌ర‌హా విల‌క్ష‌ణ‌మైన ప‌ద్ధ‌తి కేసీఆర్‌కు మొద‌ట్నించి ఉన్న‌దే. కొత్త‌గా రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు ఒక కీల‌క‌మైన కార్య‌క్ర‌మానికి ర‌త‌న్ టాటా లాంటి వ్య‌క్తి హైద‌రాబాద్‌ కు వ‌స్తే.. వారి వెన్నంటి ఉండి బ్రాండ్ హైద‌రాబాద్‌ కు మ‌రింత శోభ‌ను తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ.. కేసీఆర్ లో అలాంటి ధోర‌ణి క‌నిపించ‌దు. ర‌త‌న్ టాటా హైద‌రాబాద్ వ‌చ్చిన వేళ‌.. కేసీఆర్ త‌న ఎస్టేట్‌ లో ఉండ‌టం క‌నిపిస్తుంది.

త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడ్ని సీన్లోకి దించిన కేసీఆర్‌.. తాను పెద్దాయ‌న పాత్ర‌ను ప‌క్కా పోషిస్తుంటారు. నాడు ర‌త‌న్ టాటా హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు త‌న హాజ‌రు ఎంత ప‌రిమితంగా ఉంచారో.. ఇవాంక ట్రంప్ తాజా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగానూ అదే తీరులో వ్య‌వ‌హ‌రించారు.  రాష్ట్రానికి ఎలాంటి అతిధి వ‌చ్చినా త‌న తీరు ఎప్పుడూ ఒకేలా ఉంటుంద‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో కేసీఆర్ మ‌రోసారి ఫ్రూవ్ చేశార‌ని చెప్పాలి. ఇలాంటి విల‌క్ష‌ణ‌త కేసీఆర్‌ కు మాత్ర‌మే సొంత‌మని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News