తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నాన్చివేత దోరణికి చెక్ పెట్టనున్నారట. ఇప్పటివరకు పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులు - పార్టీ పోస్టుల విషయంలో ఇక జాప్యం ఉండబోదట. ఇటు ప్రభుత్వంలోని ఖాళీలు, అటు టీఆర్ ఎస్ పార్టీలోని పోస్టుల భర్తీని కేసీఆర్ పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. అది కూడా వారంలో భర్తీచేయనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.
జిల్లా - రాష్ట్రస్థాయిలో సమర్థులైన వారికి పదవులను కట్టబెట్టి కమిటీల ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులను ఆదేశించినట్టు తెలిసింది. జిల్లాస్థాయి పోస్టుల భర్తీకోసం ఆయా ఎమ్మెల్యేలతో సంప్రదించి మంత్రులు.. పార్టీ కమిటీ - నామినేటెడ్ పోస్టుల భర్తీ జాబితాను అందించాలన్నట్టు సమాచారం. దీంతో మంత్రి కే తారకరామారావు - ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి - ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి - టీఎస్ ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి కమిటీల తుది కసరత్తుపై చర్చించారు. పార్టీ రాష్ట్ర కమిటీ - అనుబంధ సంఘాల కమిటీలు - రాష్ట్ర - జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 15 మంది నాయకుల పేర్లను ఇప్పటికే సేకరించారు. మైనారిటీ రాష్ట్రస్థాయి చైర్మన్లు మైనారిటీ నాయకుల జాబితాను సిద్ధంచేశారు.
ఇప్పటివరకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లను వేసినా వాటిలో డైరెక్టర్లను నియమించలేదు. జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ డైరెక్టర్ల నియామకాలు జరుగాల్సి ఉంది. వీటికి సంబంధించిన జాబితాను మరోమారు సమీక్షించి గులాబీ దళపతి త్వరలో నిర్ణయం వెలువరించనున్నారని అంటున్నారు.