ప‌ద్మ‌నాభుడికి పూజ‌లు!..విజ‌య‌న్‌ తో చ‌ర్చ‌లు!

Update: 2019-05-06 16:26 GMT
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు నేటి మ‌ధ్యాహ్నం కేర‌ళ‌లో కాలు పెట్టేశారు. కేర‌ళ‌లో దిగీ దిగగానే అనంత‌ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యానికి వెళ్లిన కేసీఆర్‌... ప‌ద్మ‌నాభుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. తిరువ‌నంత‌పురంలో ల్యాండైన కేసీఆర్... అక్క‌డి తెలుగు సంఘాల ప్ర‌తినిధుల ఘ‌న స్వాగ‌తాన్ని అందుకుని ఆల‌యానికి వెళ్లారు. ప‌ద్మనాభ‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం ఆయ‌న కేర‌ళ సీఎం - క‌మ్మూనిస్టు దిగ్గ‌జం పిన‌ర‌యి విజ‌య‌న్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. లోక్‌ సభ ఎన్నికలు జరుగుతున్న తీరు - ఫలితాల సరళి ఎలా ఉండబోతోంది - ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆవశ్యకత - బీజేపీ - కాంగ్రెస్‌ కు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు ఏకమయ్యేందుకు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై వీరిద్ద‌రూ చర్చించినట్లు సమాచారం. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే దిశ‌గా ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన కేసీఆర్‌... ఇప్పటికే మమతా బెనర్జీ - నవీన్ పట్నాయక్ - మాయావతి తదితర నేతలతో చర్చలు జరిపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా క‌మ్మూనిస్టు కోట అయిన కేర‌ళ‌లో అడుగుపెట్టిన కేసీఆర్‌... క‌మ్యూనిస్టు దిగ్గ‌జాల్లో ఒక‌రిగా పేరుగాంచిన విజ‌య‌న్ తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంద‌నే చెప్పాలి.

అయితే గ‌తంలో ఒడిశాకు వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డి ఆల‌యాను సంద‌ర్శించేందుకే కేసీఆర్ వెళ్లిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇదే విష‌యాన్నిఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా వెల్ల‌డించారు. కేసీఆర్ త‌న‌తో ప్ర‌త్యేకంగా బేటీ అయ్యిందేమీ లేదు... ఏదో ఆల‌య ద‌ర్శ‌నానికి వచ్చిన స‌హ‌చ‌ర సీఎం సొంత రాష్ట్రానికి వ‌స్తే క‌ల‌వ‌కుండా ఎలా ఉంటామ‌ని వ్యాఖ్యానించిన కేసీఆర్‌... ఇప్పుడు కేర‌ళ‌లోనూ అదే త‌ర‌హా శైలిని క‌న‌బ‌ర‌చార‌ని చెప్ప‌దు. ఎందుకంటే... వెంట ఫ్యామిలీని తీసుకెళ్లిన కేసీఆర్ అక్క‌డి ఆల‌యాల సంద‌ర్శ‌న కోస‌మే వ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌న్ తో చర్చ‌లు ఏ మేర జ‌రిగి ఉంటాయ‌న్న అంశంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Tags:    

Similar News