ఏంటి....కేసీఆర్ ఫ్యామిలీ ఫ్యామిలీని కష్టాలు చుట్టముట్టాయా? ఫ‌్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బ్రతికేస్తోందనే డైలాగ్ గుర్తుకువస్తోంది అని అనుకుంటున్నారు. మీకు గుర్తుకు రావడం కరెక్టే...కేసీఆర్ ఫ్యామిలీని ఒకదాని వెంట ఒకటి కష్టాలు చుట్టుముట్టడం కూడా కరెక్టే. గులాబీ దళపతి - తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆయన కుమారుడైన మంత్రి కేటీఆర్ - కుమార్తె - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత - మేనల్లుడు కం మంత్రి హరీశ్ రావు..ఇలా నలుగురూ అనుకోకుండా ఇరకాటంలో పడ్డారనేది నిజం. ఈ ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది.
గులాబీదళపతి కేసీఆర్ పై ఆ పార్టీ కార్యకర్తలే గుర్రుగా ఉన్నారంటే నమ్ముతారా? కానీ నిజం. కేసీఆర్ తీరు కారణంగా నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని టీఆర్ ఎస్ కార్యకర్తలే ఫైరవుతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో గులాబీ జెండా పట్టుకొని నడిచిన కార్యకర్తలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు దక్కడం లేదనేది వారి ఆగ్రహానికి కారణం. ఒకవేళ దక్కినా అందులో ఎక్కువ శాతం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికే పెద్ద పీట అని అంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అయూబ్ ఖాన్ అనే వ్యక్తి ఆస్పత్రిలో మృతి చెందిన ఉదంతం వారి అసంతృప్తికి మరింత ఆజ్యం పోసింది. టీఆర్ ఎస్ ఏర్పడినప్పటి నుంచి పనిచేస్తున్న తనకు గుర్తింపుగా పదవి దక్కకపోవడంతో సాక్షాత్తు మంత్రి ముందే ఆయన ఆత్మాహుతికి పాల్పడి ఈరోజు మరణించారు.
ఇక ముఖ్యమంత్రి తనయుడైన మంత్రి కేటీఆర్ సైతం చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కేటీఆర్ సారథ్యంలోని చేనేత శాఖ సారథ్యంలోనే సాగుతున్నాయి. అయితే...ఈ చీరల పంపిణీ ఎంత రచ్చయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బతుకమ్మ పండుగ సందర్భంగా అడగకపోయినప్పటికీ సర్కారు పంపిణీ చేసే ఈ చీరలు నాసిరకంగా ఉన్నాయని, చేనేత చీరలని ఒక్కోదాని ధర రూ.250-300 ఉంటుందని ఊదరగొట్టి రూ. 50-100 లోపే ఉన్నవి అంటగట్టారని పలువురు మహిళలు మండిపడ్డారు. చాలా చోట్ల చీరలను దగ్దం కూడా చేశారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వం పరువును పలుచన చేసింది. నష్టనివారణ చర్యల కోసం ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా రంగంలోకి దిగి పరిస్థితి తమ వాదనలు వినిపించారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిందనేది నిజం.
ఇక టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరొంది మంత్రి హరీశ్‌రావుకు సైతం ఇదే రకమైన ఇబ్బంది ఎదురవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 10లో రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలోని చోటు చేసుకున్న ప్రమాదంలో 12 మంది కూలీలు మరణించారు. సొరంగం పై కప్పు కూలి మృతి చెందిన వలస కూలీలకు నివాళులు అర్పించారు. ఈ పరిణామం హరీశ్‌రావును ఇరకాటంలో పడేసింది. ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మాణం చేయాలనే ఆతృతలో భద్రతా ప్రమాణలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
మరోవైపు సీఎం కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత సైతం ఒకింత ఊపిరి సలపని స్థితిలో అంటున్నారు. ఇటు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్ననిజామబాద్‌తో పాటు ఆమెకు ఉన్న బాధ్యతల విషయంలో ఇరకాటంలో ఉన్నారని విశ్లేషిస్తున్నారు. నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ పార్టీ ఎంపీగా ఉన్న డీఎస్ తనయుడు భారీ బహిరంగ పెట్టి మరీ బీజేపీలో చేరడం ఆమెకు ఇబ్బందికరమైన దశ అంటున్నారు. అదే సమయంలో కవిత బాధ్యత వహిస్తున్న పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కుంటున్నారని చెప్తున్నారు. మొత్తంగా...ఇప్పుడంతా టీఆర్ఎస్ ఫ్యామిలీకి ఇరకాట దశ అని అంటున్నారు.