ఓ రాష్ట్ర ముఖ్య మంత్రిని బెదిరించే ధైర్యం ఎవరికైనా ఉంటుందా అంటే.. ఉండదనే సమాధానం వస్తుంది. అయితే రాజకీయావసరాల రీత్యా కొన్ని సార్లు పవర్‌ఫుల్ నేతలు కూడా సాటి నాయకులకు తలొగ్గాల్సి వస్తుంది. వారితో రాజీపడుతూ వారి డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆయన పై ఒత్తిడి పెంచుతున్నది.. ఏ రాష్ట్ర స్థాయి నేతలో లేదా మంత్రులో కాదు.
మండల, గ్రామస్థాయి నేతలు డిమాండ్లకు ఆయన తలొగ్గేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వినడానికి నమ్మశక్యం కానట్టుగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇది చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గులాబీ పార్టీకి గుబులు పుట్టిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కోపంతో కేసీఆర్ ఆందోళనలో పడ్డారు. అసెంబ్లీ వేదికగా స్థానిక ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు. దీంతో ప్రభుత్వం పై వారు అసంతృప్తి తో రగిలిపోతున్నారని చెబుతున్నారు. వీరి ఆగ్రహం అధికార పార్టీని వెంటాడుతోంది.
స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 12 స్థానాలకు డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అదునుగా ఎంపీటీసీలు తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ కోరికలు పరిష్కరించబోతే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ లు ప్రతిపాధించారు. తమకు గౌరవ వేతనం రూ. 15 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో కార్యాలయాల్లో గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని కోరుతున్నారు. వీటితో పాటుగా మరో నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. దీంతో ప్రభుత్వం ఎంపీటీసీలతో చర్చలకు ప్రారంభించింది. ఈ చర్చలు ఇంకా ప్రలప్రధం కాలేదని చెబుతున్నారు. దీంతో ఎంపీటీసీ ఫోరం తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
12 ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకునే సంఖ్యాబలం ప్రభుత్వానికి ఉంది. అయితే ఎంపీటీసీ ఫోరం తరపున అభ్యర్థులు రంగంలోకి దిగుతారనే ప్రచారం కావడంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటనే ఆందోళన గులాబీ పార్టీలో నెలకొంది.
ఇప్పటికే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల కౌన్సిలర్లు, కార్పోరేటర్లకు గౌరవ వేతనాన్ని పెంచారు. దీంతో ఎంపీటీసీలు కూడా తమకు గౌవర వేతనం పెంచాలని పట్టుబడుతున్నారు. తమ డిమాండ్ నెరవేర్చుతేనే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయమని తెగేసి చెబుతున్నారు. సమయం చూసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వం త్వరగా ఈ సమస్యలకు ముగింపు పలుకుతుందో లేక తెగేదాక లాగుతుందో వేచిచూడాలి.