ప్లీనరీలో ఈసీపై కేసీఆర్ ఫైర్.. ‘పరిధి దాటింది.. ప్రచారానికి వెళ్లట్లేదు’
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఇరవై ఏళ్లు అయిన నేపథ్యంలో హైటెక్స్ లో వైభవంగా ఏర్పాటు చేసిన ప్లీనరీలో పార్టీ అధినేతగా మరోసారి ఎంపికయ్యారు కేసీఆర్. అనంతరం ఆయన పార్టీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానుల్ని ఉద్దేశించి కీలక ప్రసంగాన్ని చేశారు. ఎప్పటిలానే.. తన ప్రసంగంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించిన ఆయన.. అనంతరం తనకు ఎదురైన సవాళ్లను వివరించారు.
ఏపీ మీదా.. సమైక్య రాష్ట్ర పాలకుల మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన.. పనిలో పనిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వదల్లేదు. త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి.. బహిరంగ సభ ఏర్పాటు విషయంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈసీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈసీ కూడా రాజ్యాంగ రపిధిని దాటి ప్రవర్తిస్తుందన్నారు.
‘భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. సభ పెట్టొద్దని చెప్పటం ఏమిటి? దళిత బంధు పథకం నిలిపేయాలనటం ఏ మాత్రం గౌరవం కాదు’’ అని మండి పడ్డారు. అంతేకాదు.. ఈసీకి ఆయన హెచ్చరిక చేయటం గమనార్హం. ‘‘ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా.. బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగా... ఒక ముఖ్యమంత్రిగా చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఈసీకి హెచ్చరిస్తున్నా’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బహిరంగ సభను ఏర్పాటు చేయటానికి కొత్త మార్గదర్శకాల్ని జారీ చేయటం.. దళితబంధు పథకాన్ని నిలిపివేయాలన్న ఆదేశంపై కేసీఆర్ ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయం తాజా హెచ్చరిక చెప్పేస్తుందని చెప్పాలి. మొత్తంగా కీలకమైన ఉప ఎన్నిక జరుగుతున్న వేళలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈ రీతిలో హెచ్చరించిన వైనం కొత్తపరిణామాలకు దారి తీస్తుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. తాను హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లటం లేదని పేర్కొనటం మరో ఆసక్తికర అంశంగా మారింది.