మాజీ ఆర్థిమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న చిదంబరం తెలంగాణ వచ్చింది కానీ.. ఏం అభివృద్ధి జరుగడం లేదని విమర్శించడంపై కేసీఆర్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభం అనంతరం తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాసిచ్చినా స్క్రిప్టును చదివడం సరికాదన్నారు. రూ. 35 వేల కోట్లతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిదంబరానికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇస్తున్న మాట వాస్తవం కాదా అని కేసీఆర్ నిలదీశారు. "కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ ఇలా పెన్షన్లు ఇస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పెన్షన్ల గురించి, విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టాలని ఆలోచించారా? 40 ఏళ్ల పాలనలో బీడీ కార్మికులను ఆదుకోవాలని ఆలోచన చేశారా? కాంగ్రెస్ 4 కిలోల బియ్యం ఇస్తే తాము కుటుంబంలోని ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నాం" అని కేసీఆర్ వివరించారు.
ఇంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని అనేక హామీలున సైతంఅమలు చేస్తున్నట్లు కేసీఆర్ వివరించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ. 51 వేలు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పథకాల గురించి ఆలోచించిందా అని ప్రశ్నించారు. రూ. 17,500 కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీలు వాస్తవం కాదా? అని కేసీఆర్ నిలదీశారు. ఇంటి రుణాలు కూడా మాఫీ చేశామన్నారు. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చేందుకు వడివడిగా పనులు జరుగుతున్న మాట వాస్తవం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. పేదలకు డబ్బాల రూమ్‌లు కట్టించి ఇవ్వగా.. తాము డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఒక్క ఖమ్మం జిల్లాలో 6 వేల ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజల బాధలను మీరు ఏనాడూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ముస్లిం మైనార్టీల గురించి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం. ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం ఈ సంవత్సరంలో 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించబోతున్నామని కేసీఆర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల్లోని పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇన్ని పనులు జరుగుతున్నప్పటికీ అభివృద్ధి లేదన్న చిదంబరం వ్యాఖ్యలు అవివేకానికి నిదర్శనమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ర్టాన్ని ఎన్నో అవమానాలు ఎదుర్కొని సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. ఎన్నో అవహేళనలు, అపవాదులు భరించి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామని గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రంలో ప్రాజెక్టులు మొదలు పెడితే చాలు స్టేలు తేవడం ప్రతిపక్షాలకు పరిపాటి అయిందన్నారు. తెలంగాణకు నీళ్లు రావొద్దన్నది వాళ్ల అభిమతంలా ఉందని కేసీఆర్ తప్పుపట్టారు. తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా సాధించుకుంటామని, రాష్ట్రంలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే వరకు విశ్రమించేదిలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.