అదేంటి... మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానసపుత్రిక కదా మన్ కీ బాత్. దాన్నితెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో ఎలా వేస్తారు? పైగా జర్నలిస్టులను అందులో ఎందుకు కలపడం? రేడియో ద్వారా ప్రధానమంత్రి తను స్పందించాలనుకుంటున్న వాటిపై మాట్లాడుతుంటే...అందులో జర్నలిస్టులు ఎందుకు ఉంటారు? అంటూ డౌటనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు కూడా.
మన్ కీబాత్ ద్వారా ప్రధాని మోదీ రేడియోకు పునరుజ్జీవం తేవడం - ప్రజలకు అనుసంధానం అవడం వంటి ఉద్దేశం పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోవిడ్-19 నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మన్ కీ బాత్ సందేశం ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నానని ప్రధాని అన్నారు. ప్రపంచ దేశాల పరిస్థితులు చూశాకే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై విలేకరుల సమావేశంలో నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్ జర్నలిస్టులపై ఉగ్రరూపం దాల్చారు. ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా - ధాన్యం కొనుగోలు అంశాలపై ఆదివారం ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం వేరే - రాష్ట్రప్రభుత్వం వేరే ఉండదని చెప్పారు. తాము 12కిలోల బియ్యం ప్రకటించామని - కేంద్రం కొంత తక్కువ ప్రకటించినంత మాత్రాన వారేం తక్కువ కాదన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దీంతో ఆపకుండా ``రాహుల్ ఈ ఎక్సట్రాలు ఎందుకు? ఎక్స్ ట్రా అడిగితే మేం కూడా ఎక్స్ ట్రా గా ఆన్సర్ చెబుతాం. సారీ..చిల్లర రాజకీయాలు వద్దు. శవాల మీద పేలాలు ఏరుకునేది వద్దు``అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో జర్నలిస్టులు షాక్ అయ్యారని అంటున్నారు. కేసీఆర్ విలేకరుల సమావేశం కాకుండా మన్ కీబాత్ అని పేరు పెట్టుకోవచ్చునని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.