తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది విలక్షణమైన వ్యక్తిత్వం అన్నది అందరికి తెలిసిందే. కొన్ని విషయాల్లో ఆయన స్పందించే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. హెచ్ సీయూలో రోహిత్ ఇష్యూనే తీసుకుంటే.. దీనికి బాధ్యత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్న విషయాన్ని తేల్చేసి.. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా ఆ మధ్యన పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా టీఆర్ ఎస్ నేత ఒకరు చెప్పిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధ్యాసాధ్యాల సంగతి పక్కన పెడితే.. ఒక కేంద్రమంత్రిపై విమర్శలు వస్తే.. ఆయన్ను ఏకంగా అరెస్ట్ చేయాలనేందుకు కేసీఆర్ వెనుకాడలేదన్న విషయం ఒకటైతే... ఆ నేత కేసీఆర్ కు సన్నిహితుడన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇటీవల హెచ్ సీయూలో వీసీ అతిధి గృహం మీద దాడి.. పోలీసులు.. మీడియా మీద దాడి చేసిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయటాన్ని.. వసతి గృహాల్లో నీరు.. కరెంటు వసతిని కట్ చేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టటం తెలంగాణ ముఖ్యమంత్రికే చెల్లుతుంది. అంతేనా.. రెండు.. మూడు రోజుల క్రితం జేఎన్ యూ విద్యార్థి కన్నయ్య హైదరాబాద్ వర్సిటీకి వచ్చిన సందర్భంగా.. ఆయన్ను అడ్డుకోవద్దని.. వర్సిటీలోకి అనుమతించాలని తానే డీజీపీ.. హైదరాబాద్.. సైబరాబాద్ కమిషనర్లకు చెప్పానని.. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దని తెలిపినట్లుగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఇదంతా తెలంగాణ సీఎం ఎందుకు చేస్తున్నట్లు అన్న ప్రశ్న వేస్తే.. వచ్చే సమాధానం భావస్వేచ్ఛ అని. మరి.. అదే భావస్వేచ్ఛ ప్రభుత్వంలో జరిగే తప్పులు ఎత్తి చూపే వారి విషయంలో ఎందుకు ప్రదర్శించరన్న విషయానికి మాత్రం సమాధానం దొరకదు. తనకు.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే వార్తల పట్ల కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కన్నయ్య లాంటి విద్యార్థి నేత విషయంలో విశాల దృక్ఫదంతో వ్యవహరించే కేసీఆర్.. తన స్నేహితుడు కమ్ కేంద్రమంత్రి అయిన దత్తన్న విషయంలో ఎందుకంత కరుగ్గా ఉన్నట్లు? వీసీ అతిధిగృహం.. పోలీసులు.. మీడియా మీద దాడి చేసిన విద్యార్థులకు సంబంధించి వసతులు కట్ చేస్తే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి.. అదే మీడియా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఎందుకు సీరియస్ అవుతారు? మీడియాకు భావస్వేచ్ఛ పరిమతంగా ఉండాలని అనుకోవటం ఏమిటి..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారెవరు..?