టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత పోలీసులకు పెద్ద ఎత్తు ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్ తాజాగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఎందుకు ఈ రేంజ్‌లో మండిపడ్డారు అంటే...బహిరంగ సభకు వచ్చిన టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఇబ్బందులు పడ్డారు కాబట్టి. సభకు వచ్చేందుకు అనేక మంది ఆసక్తి చూపించగా...వారిని తిప్పలు పెట్టే విధంగా పోలీసులు వ్యవహరించినందుకు.
ఇంతకీ అసలే జరిగిందంటే...టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రగతి నివేదిన సభ పేరుతో వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి పెద్ద ఎత్తున రైతులను తరలించేందుకు టీఆర్ ఎస్ సిద్ధమయింది. ఆ మేరకు సఫలం అయింది. అయితే పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో భారీ ట్రాఫిక్ జాం అయింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ - మరో మంత్రి జగదీశ్ రెడ్డి చిక్కుకుపోయారు. ఈ పరిణామాన్ని గమనించిన పోలీసులు పలువురిని సభకు చేరకముందే తిప్పిపంపారు. దీంతో సభకు అనుకున్న స్థాయిలో జనం రాలేదు. తాజాగా ఈ పరిణామం పైనే కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు ఉన్నత అధికారులతో సమావేశం అయిన సందర్భంగా సభ వద్దనున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. బహిరంగ సభకు హాజరైన వారిని వెనక్కు పంపించడం ఏమిటని అధికారులను కేసీఆర్ నిలదీసినట్లు తెలుస్తోంది. సమన్వయం చేయాల్సింది పోయి తప్పించుకునే విధంగా వ్యవహరించారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయగా మౌనం వహించడం పోలీసు ఉన్నతాధికారుల వంతు అయిందట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/