తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోపం ఏ స్థాయిలో ఉంటుందో స్వయంగా రుచి చూశారు హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు. ఎన్నికల్లో హామీల్లో భాగంగా.. పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి క్రమబద్ధీకరణ విషయంలో ఉదారంగా వ్యవహరించకుండా.. రూల్స్ అంటూ దరఖాస్తుల్ని రిజెక్ట్ చేయటంపై ఆయన ఆగ్రహోద్రుగులయ్యారు.
చిన్నచిన్న కారణాలు చూపించి రిజెక్ట్ చేస్తారా? మేం లక్షల్లో ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణ చేస్తామంటే.. మీరు వేలల్లో కూడా ఆమోదం తెలపరా? పభ్రుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారా? పోండి.. పోయి పని చేసుకోండి. మీకు చేతకాకపోతే.. మేం చేయించుకుంటాం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ అగ్రహాన్ని చూసిన ఇద్దరు కలెక్టర్లు తీవ్ర దిగ్భాంత్రికి గురయ్యారని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తే.. భవిష్యత్తులో కేసులు చుట్టుకునే వీలుందని.. అలా చేయకుంటే ప్రభుత్వం చేత మాట పడాల్సి వస్తోందన్న వాదనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఇదే తొలిసారంటున్నారు. ఆయనింత అగ్రహంగా వ్యవహరించటం ఇప్పటివరకూ చూడలేదంటున్నారు.