తొలిసారి గంట పాటు ఆ చానల్ చూసిన కేసీఆర్

Update: 2021-06-26 03:44 GMT
రోటీన్ కు భిన్నమైన సీన్ కు ప్రగతిభవన్  వేదికైంది. సుదీర్ఘ భేటీలు కాదంటే సమీక్షలు.. ఇలా సమావేశాల మీద సమావేశాలు.. లేదంటే వివిధ అంశాల మీద అధ్యయనాలే తప్పించి.. కులాశాగా అందరూ కూర్చొని టీవీ చూడటం అనే కాన్సెప్టు ప్రగతిభవన్ లో కనిపించదు. అందుకు భిన్నంగా శుక్రవారం రాత్రి మాత్రం భిన్నమైన సీన్ కనిపించిందని చెబుతున్నారు. ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరుతో ప్రముఖ డిస్కవరీ చానల్ లో ప్రసారమైన కార్యక్రమాన్ని ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు చెబుతున్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రముఖ డాక్యుమెంటరీఫిలిం డైరెక్టర్ రాజేంద్ర శ్రీవత్స దీన్ని రూపొందించారు. దీన్ని తాజాగా డిస్కవరీ చానల్ ప్రసారం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదుర్కొన్న సమస్యల్ని.. అనుసరించిన విధానాల్ని ఇందులో చూపించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ కథనాన్ని అసాంతం వీక్షించారు. సీఎం కేసీఆర్ తో పాటు పలువురు నేతలు.. అధికారులు ఈ షోను చూసేందుకు ప్రగతిభవన్ కు వెళ్లారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. షెడ్యూల్ లో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వారు సైతం.. వాటికి డుమ్మా కొట్టేసి చానల్ లో వచ్చే ప్రోగ్రాంను సీఎం కేసీఆర్ తో కలిసి చూసేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సీన్ ప్రగతిభవన్ లో మరెప్పుడూ చూడలేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. టీవీలో డిస్కవరీ చానల్ ను దాదాపు గంట పాటు చూడటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇదే మొదటిసారి అన్న మాటను కొందరు అధికారులు పేర్కొనటం గమనార్హం.
Tags:    

Similar News