ఎంతోకాలంగా ఎదురుచూసిన సమయం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్టు.. రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధం చేశారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 20 నుంచి గోదావరి నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాన్ని షురూ చేయనున్నారు.
ఆరంభంలో అర టీఎంసీ నీటిని ఎత్తిపోస్తూ.. అలవాటు పడిన తర్వాత రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తి పోయాలన్న లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి.. మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 200 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.
దీనికి సంబంధించి మేడిగడ్డ.. అన్నారం.. సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలు ఇప్పటికే పూర్తి కాగా.. పంప్ హౌజ్ లలో మోటార్ల బిగింపు పాక్షికంగా పూర్తయింది. గోదావరి వరద మొదలుకాగానే నీటిని ఎత్తిపోసేలా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మేడిగడ్డ పంప్ హౌజ్ లో 11 మోటార్లు.. అన్నారంలో ఎనిమిదిలో ఐదు.. సుందిళ్లలో తొమ్మిది మోటార్లకు ఆరు మోటార్లను బిగించటం పూర్తైంది. వరద నీరు వచ్చింది వచ్చినట్లుగా ఒడిసి పట్టాలన్న విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.
ఇందుకోసం ఈ పనుల్ని ఈ రోజు (మంగళవారం) నుంచి స్వయంగా తానే పరిశీలించి.. అధికారులకు మార్గదర్శనం చేయాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ అంచనా వేసినట్లే వరద నీటిని ఒడిసి పట్టటంలో విజయవంతమైతే.. కనిష్ఠంగా 55 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించటంతో పాటు.. ఆ నీటితో ఎస్సారెస్పీ కింద 9 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉంది. మిడ్ మానేరు కింద కొత్తగా 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వటంతో పాటు.. కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలిస్తూనే చెరువులన్నింటిని నింపాలని భావిస్తున్నారు.