ఇప్పటివరకూ ఉన్న ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ’’ పేరును తాము ‘‘తెలుగు రాష్ట్ర సమితి పార్టీ’’గా మారుస్తామంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామానికి చెందిన వారిని ఆకర్షించాయో.. లేదంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన పథకం ఆకర్షించిందో కానీ.. మొత్తంగా అయితే.. ఏపీలో అందునా గోదావరిజిల్లాలో కేసీఆర్ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటైంది.
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందిస్తూ.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం విశేషం.
తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేయటం గమనార్హం. వై.రామవరం లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్లో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. తమ పార్టీని ఏపీకి విస్తరించాలన్నఆలోచనలో ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించిన పక్కరోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం గమనార్హం.