కేసీఆర్ పాలిటిక్స్.. అక్కడ సీన్ మారింది..

Update: 2019-04-02 05:06 GMT
తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నా ఆ జిల్లాది ఆది నుంచి ప్రత్యేకమైన తీర్పే.. తెలంగాణలో 2014లో గులాబీకి బోటాబోటీ మెజార్టీ వచ్చింది. కానీ ఖమ్మంలో మాత్రం ఒక్కసీటే సాధించింది. ఇక 2019లో తెలంగాణ అంతటా క్లీన్ స్వీప్ సాధించిన గులాబీ పార్టీ ఖమ్మంలో మాత్రం బొక్కబోర్లా పడింది. మళ్లీ ఒకే ఒక్క సీటు సాధించింది. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇప్పుడు ఖమ్మం ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరినా ఖమ్మం మాత్రం ఇప్పటికీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు కొరకరాని కొయ్యే..

పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మం పార్లమెంట్ సీటు గెలుచుకోవడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. ఇటీవల ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు వర్గపోరుతో ఇరువురు విడిపోయి కొట్టుకొని పార్టీ అభ్యర్థులను ఓడించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖమ్మం ఎంపీ సీటు గెలుచుకోవాలని గులాబీ బాస్ జిల్లా నేతలకు తేల్చిచెప్పారు. ఈ మేరకు బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు.

తుమ్మల, పొంగులేటి కుమ్మలాటలతో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఇద్దరి తరుఫున వారికి టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఇచ్చారు.దీంతో తుమ్మల పాత గొడవలన్నీ మరిచిపోయి నామాతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అన్నీ తానై ప్రచారం చేస్తూ గెలుపించుకొని మళ్లీ మంత్రి పదవి పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజాగా పొంగులేటితో చర్చలు జరిపి నామా గెలుపు కోసం కలిసి పనిచేయడానికి ఒప్పించారు. పొంగులేటి, పల్లా, అభ్యర్థి నామా మీడియాతో మాట్లాడారు. దీంతో పొంగులేటి కూడా నామా గెలుపునకు సహకరిస్తానని తెలిపారు. ఇలా కేసీఆర్ వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది. పొంగులేటి దారికి వచ్చారు. కానీ ఒక ఒరలో కత్తుల్లా పొంగులేటితో కలవడానికి మాత్రం తుమ్మల ససేమిరా అన్నారు.పొంగులేటిని బుజ్జగించడానికి తుమ్మల రాలేదు. దీంతో ఇరువురు వేరు వేరుగానే ఖమ్మం ఎంపీ అభ్యర్థి గెలుపునకు పోరాడుతారన్న మాట.. మరి ఈ విడివిడి పోరాటం.. నామాను గెలిపిస్తుందో లేదో చూడాలి.


Tags:    

Similar News