దేశం కోసం పారాడుతున్న సైనికుల బాగోగులు చూస్తన్నట్లే సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది.- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట. తన జన్మదినం సందర్భంగా కొత్త ముఖ్యమంత్రి కార్యాలయమైన జనహితలో మరణించిన జర్నలిస్టుల కుటంబాలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులతో పాటు జర్నలిస్టులకు పలు హామీలు ఇచ్చారు. అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఇవాళ జరిగిన జనహిత మొట్టమొదటి కార్యక్రమంలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలతో సీఎం కేసీఆర్ వారి సమస్యలను ఎంతో ఓపికతో విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అదే వేదికపై ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఏ ఆధారం లేని జర్నలిస్టు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
జర్నలిస్టుల పరిస్థితి పైన పటారం లోన లొటారంలా ఉందని, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి ఏటా బడ్జెట్ నుంచి జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇచ్చే నిధులను ఈ సారి మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రూ. పదికోట్ల చొప్పున రెండేళ్లు సంక్షేనిధికి జమ చేశారని తెలిపారు. ఈసారి బడ్జెట్ లో రూ. 30 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల్లో ఎవరైనా పెళ్లీడుకు వచ్చిన ఆడబిడ్డలుంటే వారి పెళ్లి కోసం రూ. 3లక్షల ఆర్థిక సహాయం సీఎం ప్రకటించారు. అలాగే చనిపోయిన జర్నలిస్టు కటుంబాల్లో ఇండ్లు లేని వారికి వారి సొంత జిల్లాల్లో వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయమని ఆధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణను చూసుకోవాల్సిందిగా కోరారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది జర్నలిస్టులకు ఎక్కడికక్కడే ఇళ్లస్థలాలను కూడా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. జర్నలిస్టులకు ఏవైనా ఆర్థిక భారమైన ఆరోగ్య సమస్యలుంటే ప్రెస్ అకాడమీని సంప్రదించి వారిద్వారా తన దృష్టికి తేవాలని సూచించారు. దేశం కోసం పారాడుతున్న సైనికుల బాగోగులు చూస్తన్నట్లే సమాజం కోసం, సమాజ చైతన్యం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/