తెలంగాణ రాజకీయాల్లో అపార అనుభవం అతడి సొంతం.. సుధీర్ఘ రాజకీయ ప్రయాణం ఆయనది.. ఎమ్మెల్యేగా, ఎంపీగా.. మంత్రిగా ఉమ్మడి ఏపీలో ఆయన అనుభవించని పదువులు లేవు. నమ్ముకున్న పార్టీకి పూర్తిగా న్యాయం చేశాడు. ఇక ఆ పార్టీ మొత్తం అంతర్థానం అయ్యేక టీఆర్ఎస్ లో చేరాడు.
ఆయన ఎవరో కాదు.. 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రత్యర్థులు తప్పితే శత్రువులు పెద్దగా లేని రాజకీయ నాయకుడు ఎల్.రమణ. ఈ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఇటీవలే టీఆర్ఎస్ లో చేరాడు. తాజాగా కేసీఆర్ అభిమానం చూరగొని ‘ఎమ్మెల్సీ’ అయ్యాడు. మరో రాజకీయ మజిలీని మొదలుపెట్టాడు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు దిగ్గజ నేతలంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి, ఎల్.రమణ, ఎర్రబెల్లి, శ్రీహరి లాంటి వాళ్లు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరిపోయారు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇన్నాళ్లు ఉన్న ఎల్.రమణ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు.
దీంతో ఆఖరి ఆశ కూడా తెలంగాణలో ఆవిరైపోయింది. తెలంగాణలోని తెలుగు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇక టీడీపీ తెలంగాణలో ఇన్నాళ్లు ఒంటరిగా పోటీచేయలేకపోయింది. అది కాంగ్రెస్ తో కలిసి గత ఎన్నికల్లో తలపడింది. ఎల్.రమణ రాజీనామాతో ఇప్పుటు రాష్ట్రంలో పూర్తిగా టీటీడీపీ దుకాణం మూసివేసినట్టైంది.
టీఆర్ఎస్ నుంచి బీసీ అయిన ఈటల రాజేందర్ వెళ్లిపోయారు. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడా స్థానంలోకి అదే బీసీ, చేనేత వర్గానికి చెందిన ఎల్.రమణను తీసుకురావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణను రప్పించారు. అయితే చర్చలు ముగిసి టీఆర్ఎస్ లో చేరికకు ఎల్.రమణ ఒప్పుకున్నారు.
సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలని కేసీఆర్ చెప్పారని.. తనతోపాటు కలిసి రావాలని కేసీఆర్ కోరినట్లు ఎల్.రమణ నిన్న చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. దీనికి సానుకూలంగా నిర్ణయం ఉంటుందని కేసీఆర్ కు చెప్పానని ఎల్.రమణ మీడియాకు వివరించారు.
ఈ క్రమంలోనే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు ఎల్. రమణ రెడీ అయ్యారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు ఈ సందర్భంగా రమణ కృతజ్ఞతలు తెలుపడం విశేషం. తనను నాయకుడిని చేసిన చంద్రబాబును పార్టీ వీడుతూ కూడా రమణ స్మరించుకున్నారు.
రమణ ఎగ్జిట్ తో తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యే ప్రమాదంలో పడింది. తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు డిసైడ్ అయిపోయారు. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసేశారు. రేపు టీఆర్ఎస్ లో చేరి సభ్యత్వం తీసుకోనున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల్.రమణ పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. స్వర్గీయ ఎన్టీఆర్ శిక్షణలో నిఖార్సైన , అవినీతి రహిత రాజకీయాలకు రమణ పరిమితం అయ్యారు. దిగజారుడు రాజకీయాలకు రమణ పాల్పడలేదనే అభిప్రాయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కన్వీనర్ గా, మంత్రిగా పనిచేశారు.
ఉమ్మడి ఏపీ విడిపోయాక తెలంగాణలో టీడీపీ అంతర్థానమైపోయింది. చంద్రబాబు హైదరాబాద్ వదిలి ఏపీ రాజకీయాలకు పరిమితం అయ్యారు. అంతటి అయోమయ పరిస్థితుల్లోనూ పార్టీలో అంతర్గత విభేదాలతో అందరూ పోయినా రమణ మాత్రం శ్రేణులు అధైర్య పడకుండా భరోసా కల్పిస్తూ పార్టీని ముందుకు నడిపించారు.
రాజకీయాల్లో రమణ నిబద్ధత,నిస్వార్థ సేవ, అంకితభావం చూసి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించి తాజాగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.టీఆర్ఎస్ లో రమణ కొత్త జర్నీ మొదలుపెట్టబోతున్నాడు.