తిరుగులేని ఆధిపత్యం చాటే కేసీఆర్ చుట్టుూ మెల్లగా అసమ్మతి, వ్యతిరేకత... ఇంటా బయటా ముసురుకుంటున్నాయి. ఆయన ఒప్పు చేసినా - తప్పు చేసినా... గతంలో ప్రశ్న ఎదురయ్యేది కాదు. మీడియా కూడా ప్రశ్నించేది కాదు. దానికి అనేక కారణాలు. కానీ ప్రతిదానికి ఒక టైం వస్తుంది అన్నట్టు... ఎవరి చేతిలో లేని సోషల్ మీడియా కేసీఆర్ ను ఒక ఆట ఆడుకుంటోంది. తాజాగా చినజీయర్ విషయంలో ససాక్షాలతో ఒక భూ సంతర్పణ గురించి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
యాదగిరి గుట్ట అభివృద్ధి కోసం వైటీడీఏ సేకరించిన రైతుల భూమిని తాజాగా చినజీయర్ స్వామికి చెందిన జీవా సంస్థకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ప్రధాన మీడియాలో ప్రత్యేక షో చేసే తీన్మార్ మల్లన్న దీనికి సంబంధించిన డాక్యుమెంట్లతో సహా ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందీ వివరించారు.
ఎకరా పది కోట్ల విలువైన భూమిని యాదాద్రి డెవలప్ మెంట్ కోసం లక్షలు మాత్రమే ఇచ్చి తీసుకున్నారు. వాస్తవానికి రైతులకు ఆ భూమి ఇవ్వడం ఇష్టం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా.. వైటీడీఏ కు, ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే... తాజాగా దానిని చినజీయర్ స్వామికి కట్టబెట్టారట. ఈ విషయాన్ని సర్వే నెంబర్లు - సేల్ డీడ్ తో చూపించి... రైతుల నుంచి భూమినిదోచి నీకు నచ్చిన స్వామీజీకి ఎలా ఇస్తావు కేసీఆర్ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తీన్ మార్ మల్లన్న అన్ని వివరాలతో పది నిమిషాలకు పైగా వీడియో విడుదల చేశారు. ఇది విపరీతంగా వైరల్ అయ్యింది. రేవంత్ రెడ్డితో సహా అనేక మంది దీనిని షేర్ చేయడంతో లక్షల మంది చూశారు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి.