హరీష్ కు కీలకశాఖను ఇస్తోన్న కేసీఆర్

Update: 2019-09-08 06:04 GMT
అల్లుడు హరీష్ ను దూరం పెడుతారన్న ఊహాగానాలకు చెక్ చెబుతూ సీఎం కేసీఆర్  కేబినెట్ విస్తరణలో చోటు కల్పించడం విశేషం. పొంచి ఉన్న బీజేపీ ముప్పు, రాష్ట్రంలో వివాదాస్పద నిర్ణయాలు, రాజుకుంటున్న నిప్పు నేపథ్యంలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం విశేషం.

ఇక హరీష్ ను మంత్రివర్గంలోకి తీసుకోరని ఊహాగానాలకు చెక్ చెబుతూ కేసీఆర్ తన కేబినెట్ లో హరీష్ ను కన్ఫం చేయడం విశేషం. కేటీఆర్ తోపాటు హరీష్ ను కూడా మంత్రివర్గంలో కీలక రోల్ అప్పగించనున్నట్టు తెలిసింది.

కేటీఆర్ పాత శాఖలైన పంచాయతీరాజ్, ఐటీతోపాటు మున్సిపల్ శాఖలు ఇస్తారని తెలిసింది. ఇక హరీష్ కు పాత శాఖలతోపాటు కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా కేసీఆర్ నియమించబోతున్నారని సమాచారం. తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన ఆర్థికశాఖను ఏరికోరి కేసీఆర్ అల్లుడు  హరీష్ కు అప్పగించబోతుండడం ఆయన సమర్థతకు గీటురాయిగా అభివర్ణిస్తున్నారు.

రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులను పరుగులు పెట్టించిన ఘనత హరీష్ రావుదే.. అలాంటి హరీష్ కు నీటిపారుదలతోపాటు ఆర్థికమంత్రిత్వశాఖను కూడా కేసీఆర్ అప్పగించబోతున్నారట.. ప్రస్తుతం తెలంగాణకు నిధుల కొరత.. ఆర్థికమాంద్యం.. ఆర్థిక పొదుపు చేయాల్సిన దృష్ట్యానే చురుకైన హరీష్ రావునే ఆర్థికమంత్రిగా కేసీఆర్ చేయబోతున్నట్టు సమాచారం.
    

Tags:    

Similar News