ఒక ప్రధాని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అయినప్పుడు ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయి? అన్న ప్రశ్న వేస్తే.. చాలామంది చాలానే మాటలు చెబుతారు. కానీ.. ఎవరూ ఊహించనలేని విషయాలు కూడా వారి మాటల్లో వస్తాయన్న ముచ్చట ఆసక్తికరంగా ఉండటమే కాదు..నిజమా?అన్న భావన కలగటం ఖాయం. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై.. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి నిపుణులు.. ప్రముఖులతో అధ్యయనం మీద అధ్యయనం చేసి.. నోట్ల రద్దు నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఒక నివేదికను తయారు చేసి.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిసి ఆయనతో భేటీ అయిరావటం తెలిసిందే.
ప్రధాని మోడీతో భేటీకి ముందు పెద్దనోట్ల రద్దు విషయంలో కాస్త ముందుకు.. వెనక్కి ఊగిసలాట ధోరణి కేసీఆర్ లో కనిపించినా.. మోడీతో భేటీ తర్వాత మాత్రం.. నోట్ల రద్దు ఇష్యూలో ప్రధానికి తన ఫుల్ సపోర్ట్ అన్న విషయాన్ని పదే పదే స్పష్టం చేయటమే కాదు.. వివిధ వేదికల మీద నోట్ల రద్దు విషయాన్ని సమర్థిస్తూ బలమైన వాదనను వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. నోట్ల రద్దు నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసిన కేసీఆర్.. తమ మధ్య జరిగిన సంభాషణల్ని విడతల వారీగా చెబుతున్నారు. తాజాగా ఆయన నోటి వెంట ఆసక్తికర ముచ్చట ఒకటి బయటకు వచ్చింది. మోడీతో మాట్లాడుతున్నసందర్భంలో ఆయన తన దగ్గర ఎంత బంగారం ఉందన్నవిషయాన్ని తనను అడిగిన విషయాన్ని కేసీఆర్ వెల్లడించారు.
బంగారం మీద పరిమితులు విధిస్తే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని మోడీకి చెప్పటం.. బంగారం ఎన్ని రూపాల్లో భారతీయ మహిళల వద్దకు వస్తుందన్న విషయాన్ని మోడీకి తాను వివరించినట్లు కేసీఆర్ గతంలో చెప్పారు. కానీ.. ఆ సంద్భంగా చెప్పని విషయాన్ని తాజాగా చెబుతూ.. తన దగ్గర ఎంత బంగారం ఉందని ప్రధాని అడిగినప్పుడు.. తన వేలికి ఉన్న ఉంగరం చూపించి.. ఇలాంటివి రెండు మూడు ఉన్నాయని.. తన భార్య దగ్గర 50 నుంచి 60 తులాల బంగారం ఉన్నట్లు చెప్పానన్నారు. ఇక.. తన కోడలి దగ్గర కొంత బంగారం ఉన్నట్లు మోడీకి చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఒక ప్రధాని.. రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వ్యక్తిగత విషయాలు ఎలాంటి వస్తాయో చెప్పటం ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/