మంత్రులకు కొత్త రూల్ పెట్టేసిన కేసీఆర్

Update: 2019-09-29 07:00 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఆదేశాన్ని జారీ చేశారు. తన కోరికైన కొత్త సచివాలయాన్ని నిర్మించే క్రమంలో .. దాన్ని ఖాళీ చేయటం.. తాళం వేయనున్న సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సచివాలయాన్ని ఎప్పుడైనా కూల్చేయొచ్చన్న మాట వినిపిస్తోంది. సచివాలయం ఉంటే.. ప్రజలకు.. సందర్శకులకు.. వివిద పనుల మీద వచ్చే వారంతా.. అక్కడకు వెళ్లే వీలుంటుంది.

తాజాగా సచివాలయాన్ని బీఆర్కే భవన్ కు తరలించనగా.. మంత్రులకు పేషీలు ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటంతో.. ఆయా మంత్రులకు అనువుగా ఉండేలా నగరంలోని వివిద ప్రాంతాల్లో.. వారి శాఖలకు అనుకూలంగా ఉండేలా పేషీల్ని ఏర్పాటు చేసేందుకు డిసైడ్ చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం కేసీఆర్ నుంచి ఒక నోట్ మంత్రులకు వచ్చింది. దీని ప్రకారం.. ఇకపై మంత్రులు తమ నివాసాల్ని మినిస్టర్ క్యార్టర్స్ లో ఉండాలని.. వారిని కలిసేందుకు వచ్చేవారికి అందుబాటులో ఉండాలన్నారు. మంత్రుల్ని కలిసేందుకు వచ్చే సామాన్యులకు అసౌకర్యాన్ని ఎంతమాత్రం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. ఇకపై.. తప్పనిసరిగా మంత్రులు మినిస్టర్ క్వార్టర్స్ లోనే ఉండాలని ఫర్మానా జారీ చేశారు. మరి.. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన ఈ ఆదేశాన్ని మంత్రులు ఎంతమేర అమలు చేస్తారో చూడాలి.
Tags:    

Similar News