రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికి సంబంధించి చాలా విషయాలు ఒకటిగా ఉండటం తెలిసిందే. ఇప్పటికే పలు ఉదంతాల్లో ఈ విషయం స్పష్టమైంది కూడా. కొన్నిసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించటం.. మరికొన్ని విషయాలలో చంద్రబాబు బాటలో కేసీఆర్ నడవటం స్పష్టంగా కనిపిస్తుంటుంది.
కాకుంటే.. విదేశీ పర్యటనల విషయంలో ఏపీ ముఖ్యమంత్రితో పోలిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కాస్త వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తుంది. సరాసరిన ప్రతి మూడు నెలలకు ఒక విదేశీ పర్యటనలు చేసే చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్.. ఫారిన్ టూర్లు తక్కువే. తాజాగా ఆయన.. చైనాకు వెళ్లనున్నారు. చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ కు హాజరయ్యేందుకు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి స్టైల్ ను అనుసరించనున్నారు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ప్రత్యేక విమానంలో వెళ్లటం అలవాటే.
అప్పుల రాష్ట్రానికి అధిపతిగా ఉన్న చంద్రబాబే ప్రత్యేక విమానంలో వెళ్లగాలేనిది.. సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తాను వెళ్లకపోవటం ఏమిటని అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా తన చైనా పర్యటనలో ప్రత్యేక విమానంలోని కేసీఆర్ ప్రయాణించనున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ తో పాటు.. ఆయన కుమారుడు.. మంత్రి కేటీఆర్.. మరికొందరు మంత్రులు.. అధికారులు వెళ్లనున్నారు. దాదాపు వారం పాటు చైనా పర్యటన సాగనుంది. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యేక విమానం విషయంలో మాత్రం చంద్రబాబు బాటలో కేసీఆర్ నడుస్తున్నారని చెప్పక తప్పదు.