సిట్టింగ్ లంద‌రికి మ‌ళ్లీ ఛాన్స్ మాట ఎందుకు?

Update: 2018-03-12 04:30 GMT
"వీడి చ‌ర్య‌లు ఊహాతీతం వ‌ర్మ‌.. ద‌ట్స్ ద బ్యూటీ.." ఈ మ‌ధ్య‌న విడుద‌లైన భారీ ఫ్లాప్ సినిమాలో ఫేమ‌స్ డైలాగ్. ఎక్క‌డైనా సూప‌ర్ హిట్ సినిమా డైలాగ్‌ను కోట్ చేస్తుంటారు. నిజ‌మే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను పోల్చి చెప్ప‌టానికి హిట్టు.. ప‌ట్టు సినిమా అన్న‌ది కాదు.. ఆయ‌న‌కు సూట్ అయ్యేది చెప్ప‌టం ముఖ్యం అందుకే.. ఈ డైలాగ్‌ను ప్ర‌స్తావించాల్సి వ‌చ్చింది.

కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల‌న్ని అనూహ్యంగా ఉంటాయి. సగ‌టు జీవి అర్థం చేసుకునేలా అస్స‌లు ఉండ‌వు. ప్ర‌తి అడుగు వెనుక ఒక లెక్క ఉంటుంది. దానికి త‌గ్గ‌ట్లే ఆయ‌న న‌డిచే తీరు ఉంటుంది. కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట‌కు.. ఇచ్చే స్టేట్ మెంట్ లెక్క‌లు వేరుగా ఉంటాయి. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆయ‌న మాట‌లు మారిపోతుంటాయి. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రూ క‌న్వీన్స్ అయ్యేలా ఆ వాద‌న ఉంటుంది.. అదే కేసీఆర్ బ్యూటీ.

సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీట్లు కేటాయిస్తారా? అంటే.. సూటిగా స‌మాధానం చెప్ప‌లేరు. కానీ.. కేసీఆర్ చెప్పేస్తుంటారు. అయితే.. సంద‌ర్భానికి త‌గ్గ‌ట్లు. ఆ మ‌ధ్య‌న సిట్టింగులంద‌రికి సీట్లు ప‌క్కా అని చెప్పిన ఆయ‌న‌.. రెండు నెల‌ల క్రితం ప‌ని చేసే వారికి మాత్ర‌మే టికెట్లు అని.. ప‌ని తీరు ఆధారంగానే ఎంపిక ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. తాను వ‌రుస స‌ర్వేలు చేయిస్తున్నాన‌ని.. వాటి ఆధారంగానే అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పేసి గులాబీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించారు.

తాజాగా ఇదే అంశంపై కేసీఆర్ మ‌ళ్లీ స్పందించారు. గ‌త ప్ర‌క‌ట‌న‌కు భిన్నంగా ఆయ‌న తాజా స్టేట్ మెంట్ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈసారి సిట్టింగులంద‌రికి స్వీట్ న్యూస్ అన్న‌ట్లుగా.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అంద‌రికి సీట్లు ఇస్తాన‌ని చెప్పేశారు. ఎందుకిలా? ఒక‌సారి ఒక‌లా.. మ‌రోసారి మ‌రోలా కేసీఆర్ మాట్లాడ‌తారన్న సందేహం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఆయ‌న మాట‌ల‌కు రీజ‌న్స్ వేరుగా ఉంటాయి. ఆయ‌న ఏ సంద‌ర్భంలో ఎలాంటి మాట మాట్లాడార‌న్న‌ది త‌ర‌చి చూస్తే చెప్పొచ్చు.

తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ్య‌స‌భ సీట్ల‌కు అభ్య‌ర్థుల్ని కేటాయించిన సంద‌ర్భంలో అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. పార్టీలో ఎప్ప‌టినుంచో ఉన్న వారికి ప‌ద‌వులు ఇవ్వ‌కుండా.. కేవ‌లం ఏడాది క్రితం గులాబీ కారులో జ‌ర్నీ స్టార్ట్ చేసిన ఒక‌రికి.. సుమారు మూడేళ్ల క్రితం వేరే పార్టీ నుంచి గులాబీ కారులో జ‌ర్నీ కోసం వ‌చ్చిన వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన వేళ‌.. పార్టీని న‌మ్ముకున్న వారికి నిరాశ క‌మ్మ‌టం ఖాయం. అలాంటి వేళ‌.. అంద‌రిలో అసంతృప్తి రేగ‌కుండా..త‌మ‌కు ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతుందా? అన్న సందేహం క‌ల‌గ‌కుండా ఉండ‌టం కోస‌మే కేసీఆర్ తాజా వ్యాఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు.

ఫ్యూచ‌ర్  మీద ఆశ‌లు క‌ల్పించ‌టం ద్వారా.. ప్రజెంట్ అంద‌రిని కూల్ చేయ‌టం.. త‌మ‌కు అన్యాయం జ‌ర‌గ‌ద‌న్న భ‌రోసా క‌ల్పించ‌టం కోస‌మే.. సిట్టింగులంద‌రికి సీట్లు ఇస్తాన‌న్న మాట చెప్పి ఉండొచ్చ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌త ఎన్నిక‌ల‌కు ఈసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వ్య‌త్యాసం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అప్ప‌ట్లో గెలుపు ధీమాపై బోలెడంత క‌న్ఫ్యూజ‌న్ ఉండేది. కానీ.. ఈసారి అలా కాదు. పూర్తి క్లారిటీ ఉంది. అందులోకి జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించిన వేళ‌.. త‌న త‌దుప‌రి జ‌ట్టు ఎలా ఉండాల‌న్న విష‌యంపై కేసీఆర్ లెక్క‌లు కేసీఆర్‌కు ఉంటాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. భ‌విష్య‌త్తులో తీసుకునే నిర్ణయాలు ప‌లువురికి చేదుగా మారే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అప్పుడెటు త‌ప్ప‌దు. ఇప్ప‌టి నుంచే అంద‌రిని బాధ పెట్ట‌టమ‌న్న భావ‌న‌తోనే సిట్టింగుల‌కు స్వీట్ న్యూస్ అన్నట్లుగా మాట చెప్పి ఉంటార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్పుడు చెప్పిందంతా ఒక అంచ‌నా మాత్ర‌మే. అది నిజం అవ్వొచ్చు.. కాక‌పోవ‌చ్చు. ఎందుకంటే.. మ‌నం మాట్లాడుకుంటున్న‌ది కేసీఆర్ గురించి అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News