స్నేహం కోరుకునే మిత్రుడి నుంచి రిటర్న్ గిఫ్టు.. కేసీఆర్ కు ఎదురుదెబ్బేనా?
అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎదురుదెబ్బ ఎదురైతే ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అందులోకి తాను ఏం అనుకుంటే అది చేసే సత్తా.. సమర్థత పుష్కలంగా ఉన్న అధినేతకు చిన్నపాటి ఎదురుదెబ్బ కూడా చాలా గట్టిగా తగిలినట్లు అవుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే గులాబీ బాస్ కేసీఆర్ కు ఎదురైందన్న మాట వినిపిస్తోంది.
ఉద్యమ పార్టీగా మొదలైన ప్రయాణం.. అనుకున్నది సాధించి పూర్తిస్థాయి ప్రాంతీయ పార్టీగా మారటం ఒక ఎత్తు అయితే.. తనకున్న అవకాశాలతో జాతీయస్థాయిలో విస్తరించేందుకు దూసుకెళుతున్నారు కేసీఆర్.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన ఆయన.. దేశ రాజధానిలో పార్టీ ఆఫీసును ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఎప్పటిలానే తనకెంతో ఇష్టమైన రాజ శ్యామల యాగాన్ని చేస్తున్న ఆయన.. తన భార్య.. మనమడితో పాటు గులాబీ బలగాన్ని ఢిల్లీలో దింపి తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఆయనకు ఎదురైన పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.
ఢిల్లీలో అధికారపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో స్నేహ హస్తం చాటేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ దిశగా ప్రయత్నాలు జరిగినా.. సరైన ఫలితాలు రాకపోవటం తెలిసిందే.రానున్న రోజుల్లో కాబోయే మిత్రుడే కదా? అన్న ఉద్దేశంతో తేలిగ్గా తీసుకున్నారేమో కానీ.. ఢిల్లీ అధికారుల నుంచి ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇంతకాలం తెలంగాణలో చక్రం తిప్పిన ఆయన.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తహతహలాడుతూ.. దానికి కార్యక్షేత్రంగా ఢిల్లీని ఎంచుకోవటం తెలిసిందే.
పార్టీ కార్యాలయం ప్రారంభంలో భాగంగా.. తమకు బాగా అలవాటైన రీతిలో ఫ్లెక్సీల హడావుడిని ఢిల్లీలోనూ చేపట్టారు గులాబీ దళం. అయితే.. ఇక్కడ వారు మర్చిపోయిందేమంటే.. తెలంగాణలో తాము అధికారపక్షంలో ఉన్నామే తప్పించి ఢిల్లీలో కాదని. ఆమ్ ఆద్మీతో స్నేహహస్తం చాచేందుకు కేసీఆర్ కు ఆసక్తి ఉన్నా.. ఎందుకో కేజ్రీవాల్ నుంచి సరైన స్పందన లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
తమ పార్టీ ఆఫీసు ప్రారంభంలో భాగంగా తమకు అలవాటైన ధోరణిలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఎలా అయితే ఏర్పాటు చేశారో.. పార్టీ ఆఫీసు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.
ఒక మాటగా అయినా కేజ్రీవాల్ సర్కారు వారితో చెప్పాల్సిన విధంగా చెప్పినా సరిపోయేది. కానీ.. అలాంటిదేమీ లేకపోవటంతో ఎన్ డీఎంసీ (న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు వచ్చి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.
దీంతో.. పార్టీ కార్యాలయం రోడ్డు మీద ఫ్లెక్సీలతో కళకళలాడిన వాటిని తొలగించటంతో ఆ ప్రాంతమంతా బోసిపోయింది. అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో జరిగిన ఈ పరిణామంతో గులాబీ బాస్ కు చికాకు తెప్పించినా.. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇలాంటివి తప్పదన్నట్లుగా ఊరుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోరా? అంటూ నేతలు కొందరికి క్లాసులు పీకినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఇలాంటి రిటర్నుగిప్టులు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎదురవుతాయని భావించినా.. స్నేహ హస్తం చాచేందుకు సిద్ధంగా ఉన్న మిత్రుడి అడ్డాలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.