గడిచిన కొంతకాలంగా అందరి నోట వినిపిస్తున్న డిమాండ్ పై కేసఆర్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో కరోనా చికిత్సకు కేంద్రం అందుబాటులోకి తీసుకు వచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ దీన్ని అమలు చేసే వీలు కలిగింది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటన జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు అమలు చేసిన ఆరోగ్య శ్రీకి ఆయుష్మాన్ భారత్ జత కలవనుంది.
కరోనా చికిత్సకు సంబంధించి మొత్తం 17 రకాలుగా విభజించారు. ప్రస్తుతానికి ఇందులోని 14 రకాల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం అందిస్తారు. దశల వారీగా ప్రైవేటు ఆసుపత్రులకు కూడా విస్తరించే వీలుంది. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎంట్రీతో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల సంఖ్య 1668కు పెరిగింది. గతంలో వీటిలోని 642 చికిత్సను ప్రస్తుతానికి ప్రభుత్వ వైద్యశాలలో కొనసాగించాలని నిర్ణయించారు.
ఆరోగ్య శ్రీ పరిధిలోకి కేవలం 50 పడకలు ఉన్న ఆసుపత్రులకు మాత్రమే అనుమతి లభిస్తోంది. ఆయుష్మాన్ భారత్ కారణంగా ఆరు పడకలు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ.. 30 పడకలు ఉన్న సామాజిక ఆరోగ్యకేంద్రాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకాలం రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పరిదిలోకి 77.10 లక్షల కుటుంబాలకు లబ్థి చేకూరుతుండగా.. ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి కేవలం 24 లక్షల కుటుంబాలు మాత్రమే రానున్నాయి. ఈ పథకం అమలులో చికిత్సకు అయ్యే వ్యయంలో 60 శాతం కేంద్రం భరిస్తుంది. మిగిలిన ఖర్చును రాష్ట్రం భవరిస్తుంది. ఈ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.250 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రం అమలు చేస్తుండటంతో ఆరోగ్య శ్రీ పరిధిలో లేని 642 చికిత్సలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. వేరే రాష్ట్రానికి వెళ్లిన సమయంలో అనారోగ్యానికి గురైతే.. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే.. అక్కడ కూడా ఉచితంగా వైద్య సదుపాయన్ని కల్పిస్తారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. దీని క్రెడిట్ మాత్రం కేంద్రానికే వెళ్లనుంది. మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వేళ.. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం పలువురికి లాభం చేకూరే వీలుందంటున్నారు.