చిరంజీవికి గొప్ప భ‌రోసా ఇచ్చిన కేసీఆర్‌

Update: 2016-06-10 11:23 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు  మెగస్టార్ చిరంజీవికి మ‌ధ్య కొత్త బంధం మొద‌ల‌యిందా? ఇందులో భాగంగా చిరుకు కేసీఆర్ భారీ లాభం చేకూర్చ‌నున్నారా?  రాజ‌కీయవ‌ర్గాలతో పాటు ఇండ‌స్ర్టీలోనూ ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. పైగా దీనికి అవున‌నే స‌మాధానం రావ‌డం ఆస‌క్తిక‌రం.

వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం మేర‌కు హైద‌రాబాద్‌ లో చిరంజీవి కొత్త స్టూడియో ఏర్పాటుచేయాల‌ని సిద్ధ‌మ‌య్యారు.  ఈ స్టూడియోకు త‌న ఇంటిపేరు అయిన 'కొణిదెల‌' ను ఖ‌రారు చేశార‌ని స‌మాచారం. ఈ మేర‌కు త‌న ఆస‌క్తిని వెల్ల‌డిస్తూ వివ‌రాల‌న్నింటినీ సీఎం కేసీఆర్‌ కు వివ‌రించ‌గా ఆయ‌న ఓకే చెప్పార‌ని స‌మాచారం. బాల‌కృష్ణ వందో సినిమా కార్య‌క్ర‌మానికి కేసీఆర్ హాజ‌రైన సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని కేసీఆర్ చెవిలో చిరంజీవి వేశార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే చిరు ప్ర‌తిపాద‌న‌కు కేసీఆర్ గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ఏర్పాటుచేయ‌బోయే కొణిదెల స్టూడియోకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏ త‌ర‌హా స‌హాయం చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అధికారంలో ఉన్నందున ప్ర‌భుత్వం త‌ర‌ఫున భూమి అంద‌జేయ‌డ‌మే కేసీఆర్ చిరంజీవికి చేసే మేలు అయి ఉంటుంద‌ని చెప్తున్నారు. మొత్తంగా చిరంజీవి స్పందిస్తేనే లేదా ఆయ‌న ప్ర‌భుత్వానికి త‌న ప్ర‌తిపాద‌న‌ను పంపిస్తేనే పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News