సీఎంగా కేసీఆర్ అరుదైన ఘ‌న‌త‌!

Update: 2018-05-08 10:15 GMT
ఏ రాష్ట్రానికైనా స‌చివాలయం చాలా కీల‌క‌మైనది. సీఎం ద‌గ్గ‌ర నుంచి అంద‌రు మంత్రులు స‌చివాలయంలో అందుబాటులో ఉండ‌డం....అక్క‌డ నుంచి అడ్మినిస్ట్రేష‌న్ అంతా న‌డ‌ప‌డం ఆన‌వాయితీ. స‌చివాలయంలో సీఎం - మంత్రుల‌ను క‌లిసి త‌మ సాద‌క‌బాధ‌కాల‌ను సామాన్యులు చెప్పు కోవ‌డం ఆన‌వాయితీ. అయితే, తెలంగాణ‌లో మాత్రం ప‌రిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సామాన్యులే కాదు....ఎమ్మెల్యేలు - మంత్రులు కూడా స‌చివాలయంలో సీఎంను క‌లుసుకునే ప‌రిస్థితి లేదు. స‌చివాలయానికి కేసీఆర్ చుట్టం చూపుగా వ‌చ్చి పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స‌రికొత్త రికార్డు సృష్టించారు. దేశంలోనే అతి త‌క్కువ సార్లు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన ముఖ్య‌మంత్రిగా ఖ్యాతి గ‌డించారు. 2014లో అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 25 సార్లు మాత్ర‌మే స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యానికి రావ‌డం విశేషం. దాదాపుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ అన‌ధికారిక స‌చివాల‌యంగా కొన‌సాగ‌డ‌మే ఇందుకు కార‌ణం.

సాధార‌ణంగా ముఖ్య‌మంత్రులు స‌చివాల‌యంలో కేబినెట్ మీటింగ్ లు, ప్రెస్ కాన్ఫ‌రెన్స్ లు నిర్వ‌హిస్తుంటారు.అయితే, కేసీఆర్ మాత్రం దాదాపుగా ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాల‌తో పాటు త‌న‌ను వ్య‌క్తిగతంగా క‌ల‌వాల‌నుకునే వారికి ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను కేరాఫ్ అడ్ర‌స్ గా మార్చేశారు. కేసీఆర్ రావ‌డం లేదు కాబ‌ట్టి మంత్రులు...ఎమ్మెల్యేలు కూడా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోనే సీఎంతో భేటీ అవుతున్నారు. ఈ ర‌కంగా సీఎంతో పాటు వారు కూడా సామాన్యుల‌కు అందుబాటులో ఉండ‌డం లేదు. బేగంపేట్ లో సీఎం క్యాప్ ఆఫీసుఉ ఆనుకొని స‌క‌ల హంగుల‌తో నిర్మించిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోనే దాదాపు అన్ని కార్య‌క్ర‌మాల‌ను కేసీఆర్ చ‌క్క‌బెడుతున్నారు. తాను క‌ల‌వాల‌నుకున్న సామాన్యుల‌కు మాత్ర‌మే అక్క‌డికి పిలుపు వ‌స్తోంది. అంతేకాదు...స‌చివాల‌యంలో సీఎం ఆఫీసుకు ఎప్పుడైనా వీలుండే ఎమ్మెల్యేలు - మంత్రులు - ఎంపీలు కూడా....ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎంట్రీ కోసం గంట‌ల కొద్దీ వేచి చూడాల్సి వ‌స్తోంది. కాబ‌ట్టి సామాన్యుల‌కు...స‌చివాల‌యంలో మాదిరి సీఎం ను క‌ల‌వ‌డం దాదాపుగా అసాధ్యం. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల సంగ‌తి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మ‌రి అన‌ధికారిక స‌చివాల‌యంగా కొన‌సాగుతోన్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి స‌చివాల‌యానికి కేసీఆర్ ఎప్పుడు వ‌స్తార‌న్నది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌!
Tags:    

Similar News